ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సన్నిహితుడు భయ్యూజీ ఆత్మహత్య

First Published Jun 12, 2018, 3:17 PM IST
Highlights

భయ్యూజీ సూసైడ్ 

భోపాల్: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సన్నిహితుడు ప్రముఖ ఆద్యాత్మికవేత్త భయ్యూజీ మహారాజ్ మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.
తుపాకీతో కాల్చుకొని భయ్యూజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భయ్యూజీ మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.


2018 ఏప్రిల్ మాసంలో భయ్యూజీతో పాటు పలువురు ఆధ్యాత్మిక వేత్తలకు కేబినెట్ హోదా కల్పించింది. అన్నా హజారేతో పాటు యూపీఏకు మధ్య  లోక్‌పాల్ బిల్లు విషయంలో మధ్యవర్తిత్వం వహించారు.  అయితే భయ్యూజీ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

ఆధ్యాత్మిక నేతగా గుర్తింపు ఉన్న భయ్యూజీ మహరాజ్ మంగళవారం ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆయన అనుచరులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లెసెన్స్ తుపాకీతో కుడి కణతకు గురిపెట్టి మహరాజ్ కాల్చుకున్నాడని, ఆసుపత్రికి తరలిస్తుండగానే కన్నుమూశారని డీఐజీ హరినారాయణాచారి మిశ్రా మీడియాకు తెలిపారు.
 
భయ్యూజీ మహరాజ్ కొద్దికాలంగా మానసిక ఒత్తడితో ఉన్నారని దీంతోనే చనిపోయారని ఆయన సన్నిహితులు చెప్పారు.. మహరాజ్ మొదటి భార్య మాధవి 2015 నవంబర్‌లో కన్నుమూసింది. దీంతో 2017 ఏప్రిల్ 30న శివపురికి చెందిన డాక్టర్ అయూషి శర్మను మహరాజ్ వివాహమాడారు. మొదటి భార్య మృతి అనంతరం ఆయనకూ మొదటి భార్యకు పుట్టిన కుమార్తెకు మధ్య విభేదాలున్నాయనే ప్రచారం ఉంది. 
 
మధ్యప్రదేశ్‌లోని సుజల్‌‌పూర్‌లో 1968లో పుట్టిన భయ్యూజీ మహరాజ్ అసలు పేరు ఉదయ్ దేశ్‌ముఖ్. భూస్వాముల కుటుంబం నుంచి వచ్చారు. సాధారణ వైవాహిక జీవితాన్ని గడుపుతూనే ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. దీనికి ముందు మోడల్‌గా కొద్దికాలం పనిచేశారు. గత ఏడాదిన్నర కాలంగా ఆయన ప్రజలకు, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మహారాష్ట్రలో పలు సామాజిక ప్రాజెక్టులు నడపడం ద్వారా దేశనిర్మాణం, రైతుల స్థితిగతుల మెరుగుకు మహరాజ్ కృషి చేస్తూ వచ్చారు.

 

ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం నర్మదా నది ప్రక్షాళన కమిటీలో మహరాజ్ ‌పేరును చేర్చి ఆయనకు మంత్రి హోదా కల్పించింది. భ్యయూడీ మహరాజ్‌ కారుపై 2016 మే 8న పుణె సమీపంలోని రంజన్‌గావ్ రోడ్డులో దాడి జరిగింది. తన కుమార్తెను కలుసుకుని తిరిగివస్తుండగా కొందరు ఆయన కారుపై రాళ్లు రువ్వారు. మహరాజ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను. బాగా అలసిపోయాను' అని ఆలేఖలో ఆయన పేర్కొన్నారు.

 

 


 

click me!