నిత్యం రాజ్యాంగంపై దాడి చేస్తున్న బీజేపీ.. : మోడీ సర్కారుపై రాహుల్ గాంధీ విమర్శలు

Published : Nov 15, 2022, 06:03 PM ISTUpdated : Nov 15, 2022, 06:15 PM IST
నిత్యం రాజ్యాంగంపై దాడి చేస్తున్న బీజేపీ.. : మోడీ సర్కారుపై రాహుల్ గాంధీ విమర్శలు

సారాంశం

Rahul Gandhi: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిరోజూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే, గిరిజనులే దేశానికి అసలైన యజమానులనీ, వారి హక్కులే అందరికంటే ముందుంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

Bharat Jodo Yatra: దళితులు, గిరిజనులు, పేదలు హక్కులు పొందాలని అంగీకరించడం ఇష్టంలేకనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిరోజూ రాజ్యాంగంపై దాడి చేస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ అన్నారు. ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. అలాగే,  గిరిజనులే దేశానికి అసలైన యజమానులనీ, వారి హక్కులే అందరికంటే ముందుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వాషీమ్ లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో గిరిజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

బిర్సా ముండా ఆశయాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), బీజేపీ నాలుగు వైపుల నుండి దాడి చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, పేదలు హక్కులు పొందాలని అంగీకరించనందునే బీజేపీ ప్రతిరోజూ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 

కాగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర మంగళవారం (నవంబర్ 15) నాటికి 69వ రోజుకు చేరుకుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని ఫలేగావ్ నుండి రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం పాద యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, మహారాష్ట్ర మాజీ మంత్రి యశోమతి ఠాకూర్, ఇతర పార్టీ నాయకులు ఆయన వెంట నడిచారు. ఈ క్రమంలోనే ఆయన ప్రముఖ గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. 

 

 కాగా, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోని 28 జిల్లాలను కవర్ చేసింది. భారత్ జోడో యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలోని డెగ్లూర్ లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని నాందేడ్, హింగోలి జిల్లాలను కవర్ చేసింది. నవంబర్ 20న మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించే ముందు ఈ రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో 382 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దాదాపు 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత జనవరిలో జమ్మూ కాశ్మీర్లో ముగిసే భారత్ జోడో యాత్ర.. 12 రాష్ట్రాల గుండా వెళుతుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?