క్రికెట్ టోర్నమెంట్ లో విషాదం..కామెంట్రీ చెబుతుండగా..

By telugu teamFirst Published Jul 1, 2019, 12:42 PM IST
Highlights

క్రికెట్ టోర్నమెంట్ లో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ కి కామెంట్రీ చెబుతుండగా.. ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. 

క్రికెట్ టోర్నమెంట్ లో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ కి కామెంట్రీ చెబుతుండగా.. ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన కర్నాటక రాష్ట్రం నెలమంగళలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నెలమంగళ సమీపంలోని ధర్మనాయకన తాండ్యాలో కొందరు విద్యార్థులు ప్రతి వారం వీకెండ్ క్రికెట్ నిర్వహిస్తుంటారు. ప్రతి వారం లాగే ఈ వారం కూడా నిర్వహించారు. అయితే..ధర్మనాయకన తాండ్యలో నిన్న ఓ అనధికార టోర్నమెంటులో ఆడేందుకు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. దీనికి స్వచ్ఛందంగా సౌండ్ సిస్టమ్ అందించేందుకు కిరణ్ కుమార్ ముందుకొచ్చాడు.
 
సౌండ్ సిస్టమ్‌ కోసం సమీపంలోని ఓ పోల్ వద్ద నుంచి వైర్లు వేసి కరెంటు తీసుకున్నారు.  కామెంట్రీ చెప్పడానికి మైక్రోఫోన్ సిద్ధం చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో కిరణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటన జరిగిన సమయంలో కిరణ్ సోదరుడు అరుణ్‌ కుమార్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు క్రికెటర్లు కూడా ఉన్నారు. 

హుటాహుటిన ఓ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే కిరణ్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి తరలివెళ్లారు. సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేసి విచారణ చేపట్టారు. విద్యుత్ తీగల్లో లోపం వల్లే కిరణ్ మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు.

click me!