మహిళపై దాడి కేసు.. జొమాటో డెలివరీ బాయ్ అరెస్ట్

Published : Mar 11, 2021, 02:09 PM IST
మహిళపై దాడి కేసు.. జొమాటో డెలివరీ బాయ్ అరెస్ట్

సారాంశం

ఫుడ్ డెలివరీ బాయ్... ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మహిళ పై దాడి చేసి దారుణంగా కొట్టాడు


ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కి చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్... ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మహిళ పై దాడి చేసి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. సదరు మహిళపై దాడి చేసిన డెలివరీ బాయ్ ని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్‌ డెలివరీ ఆర్డర్‌లో జాప్యం చేసినందుకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో మహిళపై బుధవారం నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ ముక్కు ఎముక విరిగిపోయింది. మహిళపై దాడికి పాల్పడిన జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను కామ్‌రాజ్‌గా పోలీసులు గుర్తించారు. బెంగళూర్‌ మహిళపై దాడికి పాల్పడిన జొమాటో డెలివరీ బాయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని నగర డీసీపీ జోషీ శ్రీనాథ్‌ వెల్లడించారు.

ఈ ఘటనపై బాధితురాలు హితేష చంద్రానీని జొమాటో క్షమాపణలు కోరింది. ఆమెకు ఎదురైన చేదు అనుభవం పట్ల తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆమెను క్షమాపణలు కోరుతున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆమెకు వైద్య సాయం అందించడంతో పాటు పూర్తిగా బాసటగా నిలుస్తామని వెల్లడించింది. ఈ ఘటన అనంతరం తనకు ఎదురైన అనుభవాన్ని మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసే హితేష చంద్రానీ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం