అక్రమసంబంధం.. వృద్ధురాలి చెయ్యి విరగకొట్టిన భర్త

Published : Jul 11, 2020, 08:52 AM ISTUpdated : Jul 11, 2020, 08:55 AM IST
అక్రమసంబంధం.. వృద్ధురాలి చెయ్యి విరగకొట్టిన భర్త

సారాంశం

ఆ వ్యక్తికి ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు చేసుకోవడం కష్టంగా మారడంతో చలించిన వృద్ధుడి భార్య అతనిపై జాలిపడి తనకు వంట చేయడంలో సహాయం అందించేది.  

ఆమె కాటికి కాళ్లు చాపుకొని కూర్చుంది. ఆ వయసులో ఉన్న భార్యపై ఆమె భర్త అనుమానం పెంచుకున్నాడు. కొడుకు వయసు ఉన్న వ్యక్తితో అక్రమసంబంధ పెట్టుకుందంటూ భార్యపై అనుమాన పడ్డాడు. ఈ క్రమంలో భార్య చెయ్యి విరగకొట్టాడు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకెళితే.. 78 ఏళ్ల వృద్ధుడు బెంగళూరు సెక్రటేరియట్‌ మాజీ ఉద్యోగి. గతేడాది వాళ్ల ఇంట్లోకి ఓ దంపతులు అద్దెకు దిగారు. అతని భార్య గర్భవతి అవ్వడంతో ఈ ఏడాది ప్రారంభంలో డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆ వ్యక్తికి ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు చేసుకోవడం కష్టంగా మారడంతో చలించిన వృద్ధుడి భార్య అతనిపై జాలిపడి తనకు వంట చేయడంలో సహాయం అందించేది.

దీంతో రిటైర్మ్‌ అధికారి తన భార్య యువకుడి వద్దకు వెళ్లడంపై అనుమానం ఏర్పడి ఆమెతో గొడవ పడటం ప్రారంభించాడు. కొడుకు వయసున్న అతనితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని నిత్యం ఆమెతో పొట్లాటకు దిగేవాడు. అయినప్పటికీ లాక్‌డౌన్‌ కాలంలో యువకునికి వంట, ఇతర పనుల్లో సహాయం చేస్తూ వచ్చింది. 

ఈ క్రమంలో ముసలి దంపతుల మధ్య గోడవలు తీవ్రతరం అవ్వడంతో ఓ రోజు వృద్ధుడు కనికరం లేకుండా కోపంలో భార్యపై చేయి చేసుకున్నాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో సదరు మహిళ చేయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహాయం కోసం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం వృద్ధుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu