
Poisonous Mushrooms: అసోంలో విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. విషపూరిత పుట్టగొడుగులను తిని 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు బాధితులు అస్వస్థతకు గురై.. దిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మష్రూమ్ పాయిజనింగ్ బాధితులందరూ అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (AMCH)లో చికిత్స పొందుతూ మరణించారని డాక్టర్ డిహింగియా తెలియజేశారు. గడిచిన వారం రోజుల్లో విషపూరితమైన పుట్టగొడుగులు తిని మైనర్ సహా 13 మంది మృతి చెందటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
ఎగువ అస్సాంలోని నాలుగు జిల్లాల్లో విషపూరితమైన పుట్టగొడుగులను తిని గత 2 రోజుల్లో 13 మంది మరణించారని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత డిహింగియా ఈరోజు తెలిపారు. మష్రూమ్ పాయిజనింగ్ బాధితులందరూ అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (AMCH)లో చికిత్స పొందుతూ మరణించారని డాక్టర్ డిహింగియా తెలియజేశారు.
అస్సాంలోని ఎగువ జిల్లాలైన చరైడియో, దిబ్రూఘర్, శివసాగర్, టిన్సుకియా లలో విషపూరిత పుట్టగొడుగులను తిని గత ఐదు రోజుల్లో 35 మంది రోగులు అస్సాం మెడికల్ కాలేజీలో చేరారని, వారిలో గత రెండు రోజుల్లో 13 మంది రోగులు మరణించారని ఆయన చెప్పారు. అందులో సోమవారం నలుగురు, మంగళవారం మరో తొమ్మిది మంది మరణించారని వెల్లడించారు.
బాధితులందరూ అడవిలో పెరిగే.. విషపూరిత పుట్టగొడుగులను తినదగినవిగా భావించి తిన్నారు. తిన్న తర్వాత వారికి వికారం, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరణించిన వారిలో, చరైడియో జిల్లాలోని సోనారీ ప్రాంతానికి చెందిన ఏడుగురు, డిబ్రూఘర్ జిల్లాలోని బార్బరువా ప్రాంతానికి చెందిన ఐదుగురు, శివసాగర్ జిల్లాలో ఒకరు మృతి చెందినట్టు గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది టీ తోట వర్గానికి చెందినవారే.