భార్యకు జాబిల్లిని గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. చంద్రుడిపై ఎకరం కొన్నట్టు వెల్లడి.. అసలేం జరిగింది?

By Mahesh K  |  First Published Sep 7, 2023, 4:54 PM IST

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్త తన ప్రేయసికి జాబిల్లిని తెచ్చిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఓ ప్రైవేటు వెబ్ సైట్ ద్వారా చంద్రుడిపై ఒక ఎకరం భూమిని కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాన్ని పొందాడు. ఈ ప్రక్రియకు ఏడాది కాలం, రూ. 10 వేల ఖర్చు అయింది.
 


కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంజయ్ మహతో మనసిచ్చిన అమ్మాయికి జాబిల్లిని తెచ్చిస్తానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. కానీ, ఆమెకు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలా? అని మహతో ఆలోచనలో పడ్డాడు. జాబిల్లి మొత్తంగా కాకున్నా.. జాబిల్లిపై ఒక్క ఒకరం జాగా అయినా తన భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నట్టు తన భార్యకు పెళ్లైన తర్వాత ఫస్ట్ బర్త్ డే రోజున గిఫ్ట్‌గా చంద్రుడిపై ఒక ఎకరం భూమిని గిఫ్ట్‌గా ఇచ్చాడు.

మహతో తన ఫ్రెండ్ సహకారంతో ఈ పని చేయగలిగాడు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌ను కలిసి ఒక ఎకరం భూమి కోసం ఆర్డర్ పెట్టాడు. దీనికి ఒక ఏడాది కాలం పట్టింది. ‘చంద్రుడిపై ఒక ఎకరం భూమిని నా శ్రీమతి కోసం కొనుగోలు చేశాను’ అని మహతో నవ్వుతూ వివరించాడు. ఆ ఎకరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు తన చేతిలో ఉన్నాయని, రిజిస్టర్డ్ క్లెయిమ్ అండ్ డీడ్ ఫర్ లూనార్ ప్రాపర్టీ అని దాని మీద రాసి ఉన్నది. ఇందుకోసం మహతో రూ. 10 వేలు చెల్లించుకోవాల్సి వచ్చింది.

Latest Videos

Also Read: వివక్ష 2000 ఏళ్ల నుంచి ఇంకా కొనసాగుతున్నది.. అది పోయేదాకా రిజర్వేషన్లు ఉండాల్సిందే: ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలనం

ఆ జంటకు నిజంగా చంద్రుడిపై కొనుగోలు చేసిన జాగా వద్దకు వెళ్లే చాన్స్ లేదు. అయితే.. తాను తన భార్య అనుమికా ఇద్దరూ గార్డెన్‌లో కూర్చుని చంద్రుడిని చూస్తూ తమతో ఆ జాబిల్లికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతామని మహతో చెప్పారు. తమ ప్రేమ కథలో జాబిల్లి అంతర్భాగంగా ఉంటుందని ఆనందపడతామని వివరంచారు.

విశ్వంలో భూగ్రహం బయటిదానిపై ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. అయితే.. ఓ గిఫ్టింగ్ వెబ్ సైట్ చంద్రుడిపై భూమిని చిన్న చిన్న భాగాలుగా విక్రయిస్తున్నది. అక్కడ జాగా కొనుగోలు చేయాలనుకునేవారికి సర్టిఫికేట్‌లను ఆ వెబ్ సైట్ అందిస్తున్నది. చాలా మంది ఇండియన్లు ఈ వెబ్ సైట్ నుంచి సర్టిఫికేట్లు తీసుకుని చంద్రుడిపై ఎకరాల భూమిని ‘కలిగి’ ఉన్నారు.

click me!