టీఎంసీలోకి మళ్లీ ముకుల్ రాయ్?.. బీజేపీకి భారీ షాక్..!.. కారణం అదే..

Published : Jun 11, 2021, 01:44 PM IST
టీఎంసీలోకి మళ్లీ ముకుల్ రాయ్?.. బీజేపీకి భారీ షాక్..!.. కారణం అదే..

సారాంశం

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి భారీ షాక్ తగలబోతున్నట్టు సమాచారం. ఆ పార్టీ కీలక నేత ముకుల్ రాయ్ మళ్ళీ టీఎంసీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ముకుల్ రాయ్ ఆర్భాటంగా బీజేపీలో చేరారు.

ఇటీవల శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతోపాటు, ఆయన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మమతా బెనర్జీ అండగా నిలవడంతో ఆయన మనసు మారినట్లు తెలుస్తోంది. 

ముకుల్ రాయ్ తన కుమారుడు సుభ్రాంగ్షు రాయ్ తో పాటు టీఎంసీలో చేరే అవకాశం ఉందని జాతీయ మీడియా చెప్తోంది. వీరిద్దరూ మమతా బెనర్జీతో శుక్రవారం మధ్యాహ్నం భేటీ కాబోతున్నట్టు చెప్తోంది. 

శుక్రవారం ఉదయం టీఎంసీ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మమతా బెనర్జీ ఓ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. 

ముకుల్ రాయ్ ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయన సతీమణి కూడా కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో వారి కుటుంబానికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అండగా ఉన్నట్లు సుభ్రాంగ్షు ఇటీవల మీడియాకు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport