Tamil Nadu CM MK Stalin: తమిళులారా జాగ్ర‌త్త‌..! కుల, మతాల వారీగా విభజించే కుట్ర: స్టాలిన్‌

Published : Apr 25, 2022, 05:33 AM IST
Tamil  Nadu CM MK Stalin: తమిళులారా జాగ్ర‌త్త‌..! కుల, మతాల వారీగా విభజించే కుట్ర: స్టాలిన్‌

సారాంశం

Tamil  Nadu CM MK Stalin: కులాల‌, మతాల‌ ఆధారంగా తమిళులను విభజించే కుట్ర జ‌రుగుతోంద‌నీ, ఇటువంటి ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. అటువంటి కుట్రలను తిప్పి కొట్టాల‌నీ, తమిళులంద‌రూ ఐక్యంగా ఉండాలని అన్నారు.  

Tamil  Nadu CM MK Stalin: తమిళులను కులం, మతం పేరుతో తమిళులను విభజించే ప్ర‌యాత్నాలు జ‌రుగుతాయ‌నీ, అట్టి ప్ర‌యత్నాల ప‌ట్ల రాష్ట్ర ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ హెచ్చ‌రించారు. తమిళులుగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

చెన్నైలో ఓ ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ.. కుల, మత ప్రాతిపదికన విభజించడం ద్వారా తమిళ జాతికి ముగింపు పలక‌వ‌చ్చ‌నీ,  ఇలా చేయ‌డం ద్వారా తమిళుల అభివృద్ధిని అడ్డుకోవచ్చని కొంతమంది అనుకుంటున్నారని పేర్కొన్నారు. తమిళ సమాజం ఆ కుట్రలో చిక్కుకోకూడదనీ, ఇలాంటి ప్రయత్నం వెనుక ఉన్న కుట్ర ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు.  

సర్వతోముఖంగా శాంతి నెలకొంటేనే అన్నిరకాల ప్రగతికి దారితీస్తుందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఇలాంటి అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించిందన్నారు. అందర్నీ కలుపుకుని పోయే ద్రావిడ మోడల్ తమిళనాడును అత్యుత్తమ రాష్ట్రాల్లో మొదటి స్థానానికి తీసుకువెళుతోందని అన్నారు. 'వివాదాస్పద' సవరించిన పౌరసత్వ చట్టంపై, స్టాలిన్ గత సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీలో దానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, దానిని రద్దు చేయాలని పిలుపునిచ్చారు.

2019లో కేంద్ర ప్రభుత్వం CAAని ప్రతిపాదించిన సమయాన్ని ఆయన హైలైట్ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిందని, తన పార్టీ బిల్లును వ్యతిరేకిస్తూ.. బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల ప్రచారాన్ని కూడా నిర్వహించిందని పేర్కొన్నారు.

“మేము తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసాము. ఏఐఏడీఎంకే సీఏఏకు అనుకూలంగా ఓటు వేసింది, కానీ మేము వ్యతిరేకించడమే కాకుండా సంతకం ప్రచారం కూడా చేశాం’’ అని స్టాలిన్ అన్నారు. బిజెపి-ఎఐఎడిఎంకె ద్వయం లక్ష్యమ‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్న స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదిస్తున్నారు.

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు రోజూ 72,000 టన్నుల బొగ్గును అందించాలని తమిళనాడు సీఎం శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం పారాదీప్, విశాఖపట్నం ఓడరేవుల్లో బొగ్గును సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !