హిందూ యువతితో పెళ్లి కోసం మతం మారిన ముస్లిం యువకుడు.. సుప్రీం మద్దతు

By telugu teamFirst Published Sep 11, 2019, 3:09 PM IST
Highlights

ఛత్తీస్‌గఢ్‌లో తన కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడాన్ని ఆమె తండ్రి సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా బెంచ్ తాజా వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్‌గఢ్ కేసులో ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమె మతంలోకి మారాడు. ఈ ఇద్దరూ కలిసి జీవించవచ్చని హైకోర్టు తీర్పుచెప్పింది.

కులాంతర, మతాంతర వివాహాలకు తాము ఎలాంటి వ్యతిరేకం కాదని...  సుప్రీం కోర్టు పేర్కొంది. హిందూ, ముస్లిం వివాహాలు కూడా ఆమోదయోగ్యమేనని, చట్ట ప్రకారం పరస్పరం పెళ్లాడితే  సమస్య ఏముంటుందని అరుణ్ మిశ్రా, ఎం. ఆర్.షాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

ఛత్తీస్‌గఢ్‌లో తన కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడాన్ని ఆమె తండ్రి సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా బెంచ్ తాజా వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్‌గఢ్ కేసులో ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమె మతంలోకి మారాడు. ఈ ఇద్దరూ కలిసి జీవించవచ్చని హైకోర్టు తీర్పుచెప్పింది. అయితే ఈ తీర్పును ఆ అమ్మాయి తండ్రి సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. ఈ వివాహం సిగ్గుచేటని, దీని వెనుక ఒక రాకెట్ (ముఠా) నడుస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఆయన తరఫున వాదించారు.

ఈ కేసు విషయంలో న్యాయస్థానం పై విధంగా స్పందించింది. న్యాయస్థానం కులాంతర, మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదని చెప్పారు. 'కులాల అంతరాలు తొలిగిపోతే మంచిదే. ఉన్నత కులాలు, నిమ్న కులాలుగా చెప్పుకుంటున్న వాళ్లు పెళ్లిళ్లు చేసుకుంటే మరింత మేలు. సమాజవాదానికి కూడా అలాంటి పెళ్లిళ్లు మంచివే' అని జస్టిస్ మిశ్రా అన్నారు. హిందూ మతం తీసుకున్న ముస్లిం యువకుడిపై న్యాయస్థానం ప్రశంసలు కురిపించారు. ఓ గొప్ప భర్త, మంచి ప్రేమికుడు  అంటూ ప్రశంసించింది. ఇలాంటి పెళ్లిళ్లు సమాజానికి మంచి చేస్తాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. 

click me!