Bakrid festival: బక్రీద్ కు పశువులను బలి ఇవ్వకండి : క‌ర్నాట‌క మంత్రి

Published : Jul 07, 2022, 01:21 PM IST
Bakrid festival: బక్రీద్ కు పశువులను బలి ఇవ్వకండి : క‌ర్నాట‌క మంత్రి

సారాంశం

Karnataka: బక్రీద్ పండుగకు పశువులను బలి ఇవ్వవ‌ద్ద‌ని క‌ర్నాక‌ట మంత్రి ప్రభు బి చవాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో  ఇప్పటికే గోవధ నిషేధ చట్టం అమల్లో ఉందని ఆయ‌న ఉద్ఘాటించారు.  

Bakrid festival-cattle : బక్రీద్ పండుగకు పశువులను బలి ఇవ్వవద్దని కర్నాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు బి చవాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  అదే సమయంలో అక్రమాలకు పాల్పడి.. గోవ‌ధల‌కు పాల్పడిన‌ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క‌ర్నాట‌క‌లో ఇప్పటికే గోవధ నిషేధ చట్టం అమల్లో ఉందని మంత్రి ఉద్ఘాటించారు. ఆవులు, గొడ్డు మాంసం అక్రమంగా రాష్ట్రానికి / బయటికి తరలిస్తున్నారని, వాటిపై డేగ కన్ను వేసి గోహత్యను నిరోధించడంలో చురుగ్గా వ్యవహరించాలని పశుసంవర్థక శాఖ, పోలీసు శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సాధారణంగా బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల‌ను బలి ఇస్తుంటార‌నీ, వాటిలో ఆవు, ఎద్దు, దూడ, ఒంటెల వంటి పశువులను కూడా బలిస్తున్నార‌ని చవాన్ తెలిపారు. రాష్ట్రంలో గోవధ నిషేధం పటిష్టంగా అమలవుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ గోవులను వధించకుండా చూడాలని ఇప్పటికే పోలీసు శాఖ, జిల్లా కమిషనర్లకు సమాచారం అందించామన్నారు.

రాష్ట్రంలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లోని పశుసంవర్థక శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గోహత్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవాలని చెప్పారు. గోవధ జరిగినట్లు తేలితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చవాన్ తెలిపారు. గోవధ కోసం పశువులను అమ్మేవారు, కొనుగోలు చేసే వారిపై కేసులు నమోదు చేయడానికి అనుమతించే పశువధ నిరోధక, రక్షణ చట్టం-2020 గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి ప్రభు చవాన్ విజ్ఞప్తి చేశారు. జిల్లాల వారీగా పశుసంవర్ధక శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించామని, ఆయా ప్రాంతాల్లో గోహత్యలు జరుగుతున్నట్లు తేలితే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

బెంగళూరు నగర జిల్లాలో బక్రీద్ సందర్భంగా గోహత్యను నిరోధించడానికి, పశువులను (ఆవు, ఆవు, ఎద్దు, దూడ‌లు సహా) వధించకుండా నిరోధించడానికి బృహత్ బెంగళూరు మహానగర పాల‌క అధికారులు (BBMP) జోన్, నగరం జిల్లాలోని తాలూకాలలో టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు. దూడ, ఒంటె, గేదెల అమ్మ‌కాలు, వ‌ధ‌ల‌పై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్లక్ష్యంగా ఉంటే ఈ విషయంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రభు చవాన్ హెచ్చరించారు. అలాగే, చట్టాలను ఉల్లంఘించవద్దని ప్రజలకు సూచించే వీడియో సందేశాలను సంఘం సభ్యులు మరియు నాయకులు సోషల్ మీడియాలో ప్రసారం చేశారు. బ‌క్రీద్ సందర్భంగా ఇతర వర్గాల మనోభావాలను గౌరవించడమే కాకుండా, చట్టపరమైన చర్యలకు కూడా దూరంగా ఉండేందుకు బక్రీద్ సందర్భంగా పశువులను బలి ఇవ్వడం మానుకోవాలని కర్నాట‌క‌ రాష్ట్ర మైనారిటీ కమిషన్ మంగళవారం ముస్లిం సమాజ సభ్యులకు సూచించింది.

కాగా, ఈద్-ఉల్-అజా (బక్రీద్) జూలై 10న జరుపుకుంటారు. అయితే, ఇది చంద్ర ద‌ర్శ‌నంపై ఆధారపడి ఉంటుంది. ఈద్-ఉల్-అజాను "బలి విందు" అని కూడా పిలుస్తారు. ఇది అల్లాహ్ పట్ల తమకున్న భక్తి, ప్రేమను నిరూపించడానికి ఒక జంతువును, సాధారణంగా ఒక గొర్రె లేదా మేకను బలి ఇవ్వడం ద్వారా గుర్తించబడుతుంది. బలి తర్వాత ప్రజలు నైవేద్యాలను కుటుంబం, స్నేహితులు, ఇరుగుపొరుగు వారికి.. ముఖ్యంగా పేదలకు అందించ‌డంతో పాటు ఇత‌ర స‌హాయాలు కూడా చేస్తారు. 

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు