అప్పుడే పుట్టిన శిశువు మృతి.. ఆస్పత్రి మార్చురీలోనే మృతదేహం

Published : Sep 18, 2020, 11:41 AM ISTUpdated : Sep 18, 2020, 11:52 AM IST
అప్పుడే పుట్టిన శిశువు మృతి.. ఆస్పత్రి మార్చురీలోనే మృతదేహం

సారాంశం

ఆ హాస్పిటల్ లో ఇండోర్ లోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడం గమనార్హం. శిశువు ఈ నెల 11వ తేదీ చనిపోగా.. 12వ తేదీన మార్చురీలోని ఫ్రీజర్ లో ఉంచారు. ఆ తర్వాత  ఆ విషయాన్ని మర్చిపోయారు.

అప్పుడే పుట్టిన ఓ శిశువు చనిపోగా దాదాపు ఐదురోజులపాటు ఆ శిశువు మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. చిన్నారి మృతదేహం ఆస్పత్రిలో ఉన్న విషయం ఆస్పత్రి సిబ్బంది మర్చిపోవడం గమనార్హం. ఈ సంఘటన ఇండోర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆ హాస్పిటల్ లో ఇండోర్ లోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడం గమనార్హం. శిశువు ఈ నెల 11వ తేదీ చనిపోగా.. 12వ తేదీన మార్చురీలోని ఫ్రీజర్ లో ఉంచారు. ఆ తర్వాత  ఆ విషయాన్ని మర్చిపోయారు. కాగా.. దాదాపు ఐదు రోజుల తర్వాత మరో వ్యక్తి మృతదేహాన్ని మార్చురీ ఫ్రీజర్ లో పెట్టాలని చూశారు. ఆ సమయంలో.. చిన్నారి శవం ఉన్నట్లు గుర్తించారు. శిశువు మృతదేహం కోసం ఎవరూ రాలేదని దీంతో.. మర్చిపోయినట్లు వైద్య సిబ్బంది చెప్పడం గమనార్హం.. కాగా.. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం