దమ్ముంటే.. ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌లను నిషేధించాలని కాంగ్రెస్‌కు  బొమై "సవాల్" 

Published : May 27, 2023, 02:58 AM IST
దమ్ముంటే.. ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌లను నిషేధించాలని కాంగ్రెస్‌కు  బొమై "సవాల్" 

సారాంశం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భజరంగ్ దళ్‌పై నిషేధం విధించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై శుక్రవారం సవాల్ విసిరారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎవరూ నిషేధించలేరు. గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దానిని నిషేధించాలని ధైర్యం చేసిన వారిని ఇంటికి పంపారని పేర్కొన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను ఉద్దేశించి.. ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్‌పై నిషేధం విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సవాల్ విసిరారు. వాళ్లంతా బుజ్జగింపుల కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించే పని జరిగిందనీ, ప్రజలు వారిని ఇంటికి పంపివేశారని, సంఘ్ పరివార్‌ను నిషేధించే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌లను నిషేధించేందుకు ప్రభుత్వం వెనుకాడదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన ప్రకటనపై బి బొమ్మై స్పందించారు.

సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లకు అధికారం ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌పై నిషేధం విధించాలని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సవాల్ విసిరారు. ఆర్టీనగర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పడిందన్నారు. సీఎం, డీసీఎంతో పాటు 8 మంది మంత్రులు కూడా ఉన్నారు. ఆ 8 మంది మంత్రులు మాట్లాడుకోవడం చూస్తుంటే.. ద్వేషం, ప్రతీకార రాజకీయాలు చేయడం మొదలుపెట్టారని అర్థమవుతోందనీ, వాగ్దానాలన్నింటినీ పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రతీకార రాజకీయాలను ప్రారంభించారని అన్నారు.  రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రతీకార రాజకీయాలే ఎజెండాలో ఎక్కువగా కనిపిస్తున్నాయని మాజీ సీఎం అన్నారు.

 అభివృద్ధి కంటే వారికి పగ, ద్వేష రాజకీయాలే ముఖ్యమన్నారు. వాళ్లు ఏం చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామనీ, వారి చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, వారి ఆలోచనలను కూడా వెనక్కి నెట్టివేస్తామని అన్నారు. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ నిషేధం గురించి మాట్లాడుతున్నారు. ఏ యూనియన్‌కు నిషేధించే హక్కు వారికి లేదు, ఇది కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిందనీ, ఇదంతా తెలిసి బుజ్జగింపు రాజకీయాలు చేయబోతున్నారని ఆరోపించారు.

ఒకవైపు కాంగ్రెస్‌ మంత్రులు ఓ వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు ఇస్తూనే మరోవైపు ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్న వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, అలా చేసే అధికారం తమకు లేదని బి బొమ్మై కాంగ్రెస్‌పై అభియోగాలు మోపారు. ఆర్‌ఎస్‌ఎస్ లేదా బజరంగ్ దళ్‌ను నిషేధించే విషయంలో కాంగ్రెస్ ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాలని, తాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరుతున్నాననీ,  మీరు మీ మంత్రివర్గ సహచరులకు మద్దతిస్తారా? లేదా వారితో విభేదిస్తారా? మీరు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలి" అని ఆయన అన్నారు.

బిజెపి  ప్రకారం.. RSS అనేది దేశాన్ని నిర్మించిన సంస్థ. ఇది గత 75 సంవత్సరాలుగా దాని విధానాలు, సూత్రాలను ప్రజలలో మమ్మేకమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎవరూ నిషేధించలేరు. గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దానిని నిషేధించాలని ధైర్యం చేసిన వారిని ఇంటికి పంపారని ఆయన పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?