
భారతదేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న సెలబ్రిటీల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులతో పాటు ఉన్నతాధికారులు సైతం కోవిడ్ బారినపడ్డారు.
అలాగే కేంద్ర మంత్రివర్గంలో హోంమంత్రి అమిత్ షాతో పాటు మరో నలుగురు మంత్రులకు వైరస్ సోకింది. తాజాగా ఈ జాబితాలో ఆయుష్ మంత్రి యశోనాయక్ శ్రీపాద కూడా చేరారు.
Also Read:విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం: కోలుకోవాలంటూ కుమార్తె ప్రార్థనలు, మృత్యుంజయ హోమం
తాను ఈ రోజు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నానని, తనలో ఎటువంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు శ్రీపాద ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని యశోనాయక్ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలు ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.