ఆటో-ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా 7 మంది మృతి

Published : May 04, 2023, 05:58 AM IST
 ఆటో-ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా 7 మంది మృతి

సారాంశం

Sitamarhi Road Accident: బీహార్‌లోని సీతామర్హిలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆగ్ర‌హించిన గ్రామ‌స్తులు ట్ర‌క్కును త‌గుల‌బెట్టారు. గ్రామంలో ఇంకా ఉద్రిక్త ప‌రిస్థితులు కొనసాగుతున్నాయి.   

7 killed in road accident in Bihar: బీహార్‌లోని సీతామర్హిలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆగ్ర‌హించిన గ్రామ‌స్తులు ట్ర‌క్కును త‌గుల‌బెట్టారు. గ్రామంలో ఇంకా ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే..  బీహార్ లోని సీతామర్హి జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తీవ్రంగా ఉండటంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చ‌నిపోయిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన‌వార‌ని స‌మాచారం. మగోల్వా ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్కు త్రిచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. 

ఓ వివాహ వేడుకకు హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. "మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. క్షతగాత్రులను సీతామర్హిలోని జిల్లా ఆసుపత్రికి తరలించాము. వారి పరిస్థితి నిలకడగా ఉంది" అని సదర్ (సీతామర్హి) ఎస్డీవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్ర‌మాదం త‌ర్వాత ట్ర‌క్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన లారీ, ఆటో ఢీకొన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత ఆగ్రహించిన గుంపు రోడ్డును దిగ్బంధించి ట్రక్కుకు నిప్పుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో జనాన్ని తొలగించడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీతామర్హి-పుప్రి రహదారిలోని పాఖీ చౌక్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రజలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంది.

ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరైన మహ్మద్ జబీర్ నదాఫ్ మాట్లాడుతూ.. "తన కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు తన కూతురు కుటుంబం వచ్చింది. వీరు సోన్‌బర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాషియా గ్రామం నుంచి వచ్చారు. ఈ రోజు వారు తమ ఇంటికి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది" అని నదాఫ్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..