నగ్నంగా మార్చి.. బ్లేడుతో కోసి.. దారుణ హత్య

Published : Jan 28, 2019, 01:02 PM IST
నగ్నంగా మార్చి.. బ్లేడుతో కోసి.. దారుణ హత్య

సారాంశం

నగ్నంగా మార్చి.. బ్లేడుతో దారుణంగా కోసి మరీ హత్య చేశారు. ఈ సంఘటన బెంగళూరు శివారు ప్రాంతమైన మారతహళ్లిలో చోటుచేసుకుంది.

బెంగళూరు శివారులో ఓ యువకుడి హత్య తీవ్ర కలకలం రేపింది. ఆటో డ్రైవర్ ని నగ్నంగా మార్చి.. బ్లేడుతో దారుణంగా కోసి మరీ హత్య చేశారు. ఈ సంఘటన బెంగళూరు శివారు ప్రాంతమైన మారతహళ్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దేవరచిక్కన్నహళ్లికి చెందిన కుమార్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుమార్.. పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు అతనిని అడ్డుకున్నారు. బలవంతంగా కుమార్ ని ఎవరూలేని ప్రాంతానికి తరలించారు.

అనంతరం అతని శరీరంపై ఉన్న దుస్తులు తీసి నగ్నంగా మార్చారు. అంటితో ఆగకుండా.. ఒంటిపై బ్లేడ్ తో గాయాలు చేసి.. చిత్రహింసలు పెట్టిమరీ హత్య చేశారు. దీనంతటినీ వీడియో కూడా తీయడం గమనార్హం. తీవ్రగాయాలపాలై కుమార్ అక్కడే మృతి చెందాడు.

నిందితుల్లో ఇద్దరు పవన్, కిశోర్ లు కుమార్ కి మిత్రులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిపై పలు రౌడీషీట్ లు, దోపీడీ కేసులు ఉన్నాయి. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?