కేర‌ళ‌లో దారుణం.. ఒకే ఇంట్లో న‌లుగురు కుటంబ స‌భ్యుల అనుమాన‌స్ప‌ద మృతి

Published : Feb 21, 2022, 12:30 AM IST
కేర‌ళ‌లో దారుణం.. ఒకే ఇంట్లో న‌లుగురు కుటంబ స‌భ్యుల అనుమాన‌స్ప‌ద మృతి

సారాంశం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అనుమానస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఒకే సారి నలుగురు మృతి చెందిన వార్త స్థానికంగా కలకరం రేపింది. 

కేర‌ళ‌లో (kerala) దారుణం జ‌రిగింది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు స‌భ్యులు అనుమాన‌స్ప‌దంగా మృతి చెందారు. ఈ ఘ‌ట‌న త్రిస్సూర్ (Thrissur) జిల్లా కొడంగల్లూర్ (Kodungallur) పట్టణంలోని ఉజువతుకడవు (Uzhuvathukadavu) గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతులను ఆషిక్ (41), అతని భార్య అబీరా (34), వారి పిల్లలు ఫాతిమా (14), అనోనీసా (8)గా పోలీసులు గుర్తించారు. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ కుటుంబం ఉజువ‌తుక‌డ‌వు గ్రామంలో నివాసం ఉంటోంది. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇరుగు పొరుగు వ్య‌క్తులు ఈ కుటుంబాన్ని ప‌ల‌క‌రించ‌డానికి వచ్చారు. ఆ స‌మ‌యంలో ఇంటి డోర్ (door) వేసి ఉంది. ఫోన్ చేసినా కుటుంబ స‌భ్యుల ఎవ‌రి నుంచీ స్పంద‌న రాలేదు. దీంతో ఇంటి డోర్ కు లోప‌లి నుంచి లాక్ వేసి ఉంద‌ని గ‌మ‌నించారు. అలాగే కిటికీలకు టేపులు అతికించబడి క‌నిపించాయి. వారికి అనుమాన‌స్ప‌దంగా అనిపించ‌డంతో పోలీసులు స‌మాచారం అందించారు. 

పోలీసు ఘ‌ట‌న స్థలానికి చేరుకున్న త‌రువాత ఇంటి లోప‌లికి వెళ్లారు. వారి బెడ్ రూమ్ (bed room) లోప‌లికి వెళ్లి చూస్తే మృతదేహాలు క‌నిపించాయి. ఆ గ‌దిలో వారికి గ్యాస్ (gas) వాస‌న వ‌చ్చింది. అయితే ఆ కుటుంబసభ్యులు విషవాయువు పీల్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. విచార‌ణ సంద‌ర్భంగా ఆ కుటుంబం కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్‌ (carbon monoxide gas)ను తయారు చేసేందుకు ఆన్ లైన్ (online)  ద్వారా కాల్షియం కార్బోనేట్ (calcium carbonate), జింక్ ఆక్సైడ్‌ (zinc oxide)తో సహా రసాయనాలను కొనుగోలు చేసిన‌ట్టు వెల్ల‌డైంది. ఇంట్లో నుంచి గాలి బ‌య‌ట‌కు లీక్ కాకుండా ఉండేందుకు కిటికీలు, తలుపులు టేపులతో మూసివేసి ఉన్నాయి. ఓ కంటైనర్‌లో తెల్లటి పొడిని కూడా పోలీసులు గుర్తించారు. అయితే మృతుడు ఆషిక్ (Ashiq) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (software engineer) గా ప‌ని చేస్తున్నారు. కొంత ఆర్థిక సంక్షోభంలో ఇరుకున్నార‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇది ఇలా ఉండగా.. కేర‌ళ (kerala) రాష్ట్రంలోని మలప్పురంలో గత నెలలో మ‌రో ఆత్మ‌హ‌త్య జరిగింది. మలప్పురం (Malappuram)  జిల్లా తెన్హిప్పలం (Thenhippalam)  ప్రాంతంలోని తన ఇంట్లో 18 ఏళ్ల యువ‌తి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మైన‌గ‌ర్ గా ఉన్న‌ప్పుడు ఎనిమిది మంది వ్యక్తుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మృతురాలి త‌ల్లి ఆదివారం ఏదో పని నిమిత్తం ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. ఇంటికి తిరిగి వ‌చ్చిన త‌రువాత ఆమె ఇంటి డోర్ కొట్టిన యువ‌తి డోర్ తీయ‌లేదు. దీంతో కూతురుకు ఫోన్ చేసిన అటు నుంచి స్పంద‌న రాలేదు. దీంతో చిన్న కిటికిలో నుంచి లోప‌లికి చూడ‌టంతో గదిలో అపస్మారక స్థితిలో ఉన్న బాలిక క‌నిపించింది. దీంతో ఆమెను వెంట‌నే కుటుంబ ఆస్పత్రికి తరలించారు. అక్క‌డ ఆమె చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మృతి చెందారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌