ఇళ్లు అమ్మే విషయంలో మాజీ ఐఐఎస్ ఆఫీసర్ తన భార్యతో గొడవలు పడుతున్నాడు. సుప్రీంకోర్టులో లాయర్ గా పని చేసే ఆమెను కోపంతో హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది.
ఆయన ఓ మాజీ ఐఐఎస్ (భారత సమాచార శాఖ) ఆఫీసర్. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే స్వచ్చంధ విరమణ పొందారు. భార్య సుప్రీంకోర్లు లాయర్. కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. అయితే కొంత కాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. అతడు తాము నివసిస్తున్న బంగ్లాను అమ్మేయాలని భావిస్తుండగా.. భార్య దానికి నిరాకరిస్తోంది. ఈ విషయమే వారి మధ్య గొడవలు జరగడానికి కారణం. ఈ క్రమంలో కోపంతో ఒక రోజు ఆమెను హతమార్చి, ఇంట్లోని ఓ గదికి వెళ్లి దాక్కున్నాడు. తరువాత పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని వీఐపీ సెక్టార్‌లో 61 ఏళ్ల రేణు సిన్హా తన భర్త నితిన్ నాథ్ సిన్హాతో కలిసి నివసిస్తున్నారు. ఆమె లాయర్ కాగా.. భర్త ఐఐఎస్ (భారత సమాచార శాఖ) ఆఫీసర్ గా పని చేసి, స్వచ్చంధ పదవి విరమణ చేశారు. కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. అయితే నితిన్ నాథ్ సిన్హా వారు ఉంటున్న బంగ్లాను అమ్మాలని అనుకున్నాడు. దాని కోసం రూ.55 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ ఇల్లు అమ్మడం భార్యకు ఇష్టం లేదు. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం నితిన్ భార్యను హతమార్చాడు. అనంతరం డెడ్ బాడీని బాత్ రూమ్ లో ఉంచాడు. అనంతరం అతడు స్టోర్ రూమ్ కు వెళ్లి దాక్కున్నాడు. అయితే రెండు రోజులు నుంచి ఫోన్ చేస్తున్న సిన్హా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె సోదరుడికి అనుమానం వచ్చింది. అందుకే పోలీసులతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. బాత్‌రూమ్‌లో సిన్హా మృతదేహం కనిపించింది. దర్యాప్తులో భర్త ఇంటిని విడిచి వెళ్లలేదని తేలింది. దీంతో ఇంట్లోనే గాలించగా.. స్టోర్ రూమ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై నోయిడా పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.