దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం.. పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం..

Published : Aug 13, 2023, 01:31 PM IST
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం.. పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం..

సారాంశం

అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై పొరిగింట్లో నివసించే ఓ 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పకూడదని బాలికను బెదిరించాడు. కానీ ఆమె తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ చూసిన వారిపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫీసుకు వెళ్లినా, కాలేజీకి వెళ్లినా, రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినా వారిపై ఓరచూపులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని సార్లు అయితే వారిపై కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడటం లేదు. బంధువులు కూడా వావి వరసలు మరిచి తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. 

ఎంతో నమ్మకంగా ఉండే ఇరుగు పొరుగు వాళ్లను కూడా ప్రస్తుతం నమ్మలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో వారే అదును చూసి చిన్నారులపై కామంతో కాటేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లోనూ ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఏడేళ్ల చిన్నారినపై ఆమె పొరిగింట్లో నివసించే 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ ఝలావర్ జిల్లాలోని పెడావా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఏడేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే ఆమె ఇంటికి సమీపంలో 35 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు తరచూ బాలిక ఇంటికి వెళ్లేవాడు. అయితే నిందితుడి ఇంట్లో ఉండే పెంపుడు పిల్లితో బాలిక ఆడుకునేందుకు వెళ్లేది. ఈ క్రమంలో శుక్రవారం ఆ బాలికపై నిందితుడు కామవాంఛ పెంచుకున్నాడు. 

ఎవరూ లేని సమయంలో చూసి శుక్రవారం ఆ బాలికను సమీపంలోని పొలాల్లోకి ఎత్తుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, ఒక వేళ చెపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మైనర్ ను హెచ్చరించాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అయినా కూడా ఎంతో ధైర్యం చేసి శుక్రవారం సాయంత్రం తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు పెడావా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. కూతురుపై జరిగిన లైంగిక దాడిని వివరించారు. నిందితుడిపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని విష్ణు డాంగిగా గుర్తించారు. అదే రోజు సాయంత్రం అతడిని అరెస్టు చేశారు. అనంతరం బాలికను శనివారం పరీక్షల కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?