టీకాలు వేయించుకోకుంటే.. బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా నిషేధం.. ఎక్కడంటే...

By SumaBala BukkaFirst Published Jan 25, 2022, 2:10 PM IST
Highlights

రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఆంక్షలను కఠినతరం చేశారు. టీకాలు వేయించుకోని వ్యక్తులను ఆసుపత్రులు మినహా బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా నిషేధిస్తూ అసోం ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 8వ తరగతి విద్యార్థుల వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. 

గౌహతి : దేశవ్యాప్తంగా రోజురోజుకూ corona virus cases పెరుగుతున్నాయి. రోజూ వేలకొద్ది కేసులు నమోదవుతూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. కరోనాను అదుపులోకి తేవడానికి అనేక రాష్ట్రాలు రకరకాల ఆంక్షలు, నిబంధనలతో కరోనా కట్టడికి నడుం బిగించాయి. ఈ నేపథ్యంలో Assam ప్రభుత్వం ఓ కొత్త నిబంధనతో ముందుకు వచ్చింది. దీంతో కరోనా కట్టడిని అదుపుచేయడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అసోం రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అధికారులు కోవిడ్ కట్టడికి ఆంక్షలను కఠినతరం చేశారు. vaccination వేయించుకుని వ్యక్తులు Public Placesలను సందర్శించకుండా ban చేశారు. 

రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఆంక్షలను కఠినతరం చేశారు. టీకాలు వేయించుకోని వ్యక్తులను ఆసుపత్రులు మినహా బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా నిషేధిస్తూ అసోం ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 8వ తరగతి విద్యార్థుల వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. పౌరులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు టీకా రుజువును తీసుకెళ్లాలని ప్రభుత్వం కోరింది. ‘అన్ని జిల్లాల్లోని 8వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తరగతులను నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు విద్యాసంస్థలన్నీ వర్చువల్ ఆప్షన్ లకు మారతాయి’ అని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. 

అన్ని జిల్లాల్లో 9వ తరగతి అంతకంటే ఎక్కువ తరగతుల విద్యార్థులకు ప్రత్యామ్నాయ రోజుల్లో పాఠశాలల్లో తరగతులు అనుమతించాలని నిర్ణయించారు. 

ఇదిలా ఉండగా, భారత్‌‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. అయితే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త తగ్గడం కొంత ఊరట కలిగిస్తుంది. వరుసగా 5 రోజులుగా 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంట్లలో కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 614 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,90,462కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 

ఇక, నిన్న కరోనా నుంచి 2,67,753 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించినవారి సంఖ్య 3,70,71,898 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,36,842 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు భారీగా తగ్గింది. కిందటి రోజు  20.75 శాతంగా ఉన్న పాజిటివిటీ రేట ప్రస్తుతం 15.52 శాతంకు చేరింది. మరోవైపు వీక్లీ పాజిటివిటీ రేటు 17.17 శాతానికి పెరిగింది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు.. 93.15 శాతం, మరణాల రేటు 1.23 శాతం, యాక్టివ్ కేసుల శాతం 5.62 శాతంగా ఉంది.  

ఇక, సోమవారం రోజున (జనవరి 24) దేశంలో 16,49,108 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,88,02,433కి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 62,29,956 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,92,09,308 కి చేరింది. 

click me!