అస్సాంలో కిస్సింగ్ బాబా అరెస్ట్... "చమత్కారీ చుంబన్" పేరుతో ముద్దులు,కౌగిలింతల వైద్యం...

By Arun Kumar PFirst Published Aug 24, 2018, 5:04 PM IST
Highlights

ప్రజల అమాయకత్వమే అతడి పెట్టుబడి. తన వద్ద అతీత శక్తులున్నాయని నమ్మించి కిస్సింగ్ బాబాగా మారాడు. వైద్యం పేరుతో మహిళల్ని లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

తాను దైవ స్వరూపిడినని, తనకు అతీత శక్తులున్నాయని చెబుతూ నమ్మించి మోసం చేసే బాబాలను మనం ఇప్పటివరకు చూశాం. అమాయక ప్రజలకు దేవుడిపై  వున్న విశ్వాసమే వారి పెట్టుబడి. కానీ ఈ విశ్వాసంతో తన లైంగిక వాంఛ తీర్చుకోడానికి ప్రయత్నించిన ఓ దొంగ బాబాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే... అస్సాంలోని మారిగావ్ జిల్లాలో ప్రకాశ్ చౌహాన్ అనే ఓ వ్యక్తి కిస్సింగ్ బాబా అవతారమెత్తాడు. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న అతడు బాబాగా చెలామణి అవుతూ అమాయక మహిళల్ని బుట్టలో వేసుకునేవాడు. మానసిక, శారీరక సమస్యలతో అతడిని ఆశ్రయించే మహిళల్ని లైంగికంగా వేధించేవాడు. వారిని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం ద్వారా సమస్యలను పరిష్కరిస్తానని నమ్మించేవాడు.

తనకు అతీత శక్తులున్నాయని అమాయకులను నమ్మిస్తూ ''చమత్కారీ చుంబన్''(అధ్బుతమైన ముద్దులు) పేరుతో వైద్యం చేసేవాడు. ఇందుకోసం ఏకంగా ఓ ఆలయాన్నే నిర్మించుకున్నాడు. 

ఈ బాబా మోసాల గురించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో అతడికి సహకరిస్తున్న తల్లిని, అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి దొంగబాబాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
 

click me!