ఆ రాష్ట్రంలో మందు బాబులకి, వాహనదారులకి ఒకేసారి గుడ్ న్యూస్..!!

Siva Kodati |  
Published : Feb 12, 2021, 03:01 PM ISTUpdated : Feb 12, 2021, 03:02 PM IST
ఆ రాష్ట్రంలో మందు బాబులకి, వాహనదారులకి ఒకేసారి గుడ్ న్యూస్..!!

సారాంశం

అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ అ‍క్కడి బీజేపీ ప్రభుత్వం ఊరట కలిగించింది

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. దీని స్పీడ్ చూస్తే రాబోయే రోజుల్లో ధరలు సెంచరీ కొట్టే ఛాన్స్ వుందని సామాన్యులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ అ‍క్కడి బీజేపీ ప్రభుత్వం ఊరట కలిగించింది. అలాగే మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సవరించిన ఈ రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌, మద్యంపై అదనపు సెస్ విధించామని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు రోగుల సంఖ్య  బాగా తగ్గిందని బిశ్వాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధరలతో పాటు సుంకాన్ని తగ్గించినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు కొత్త గరిష్టాలను తాకిన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

కాగా అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌లో జరగనున్నాయి, ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారీ కసరత్తు చేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Relationship : ఏవండోయ్ పెళ్లాలు.. మీ మొగుళ్లను ఇలా పిలుచారో విడాకులే...!
సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం