
గత కొన్ని నెలలుగా హింసాకాండలో రగిలిపోతున్న మణిపూర్ శాంతి కోసం ఎదురుచూస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ అల్లర్లు తగ్గడం లేదు. అయితే.. ఈ విషయంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక ప్రకటన చేశారు. మణిపూర్‌లో 7-10 రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయని ఆయన శనివారం అన్నారు.
ఈశాన్య రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనగా ప్రతిపక్షాలు తమ ఆందోళనను ప్రదర్శిస్తున్నాయని కాంగ్రెస్‌పై సీఎం శర్మ మండిపడ్డారు. అల్లర్ల సమయంలో మౌనంగా ఉండీ.. శాంతి నెలకొనే సమయంలో కాంగ్రెస్ ఏడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఘర్షణలు.. జరిగిన సమయంలో రాహుల్ ఎక్కడికి వెళ్లారాని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో హింసాత్మక ప్రాంతాలను సందర్శించి.. అక్కడి సహాయక శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలను కూడా కలుసుకున్నారు.
గత నెలలో పొరుగు రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగిందని, మణిపూర్ ప్రభుత్వం , కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయని సిఎం శర్మ పేర్కొన్నారు. ఒక నెల క్రితం హింస ఏ స్థాయిలో ఉందో, ఈరోజు ఏ స్థాయిలో ఉందో మీరు చూడవచ్చు? హింస జరిగిన చోట, పరిస్థితిలో విస్తారమైన మెరుగుదల ఉంటుందని తాను హామీతో చెప్పగలనని అస్సాం సీఎం తెలిపారు. మే 3న మణిపూర్‌లో మెయిటీ మరియు కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో కుల హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడగా, కొందరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.