సావర్కర్ సహకారాన్ని ప్రశ్నించడం పాపం.. రాహుల్ పై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు  

By Rajesh KarampooriFirst Published Nov 20, 2022, 10:46 AM IST
Highlights

స్వాతంత్య పోరాటంలో సావర్కర్ సహకారాన్ని ప్రశ్నించడం పాపమనీ, ఆ పాపాన్ని రాహుల్ గాంధీ చేయకూడదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. 

భారత్ జోడో యాత్రలో  సాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బీజేపీతోపాటు.. శివసేన కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం మండిపడ్డారు. స్వాతంత్య పోరాటంలో సావర్కర్ సహకారాన్ని ప్రశ్నించడం పాపమనీ, ఆ పాపాన్ని రాహుల్ గాంధీ చేయకూడదని అన్నారు. 

600 సంవత్సరాలకు పైగా అస్సాంను పాలించిన అహోం రాజవంశానికి చెందిన లెజెండరీ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ వార్షికోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో సీఎం హిమంత బిస్వా శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోం సీఎం మాట్లాడుతూ.. మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతదేశాన్ని ఎప్పటికీ జయించలేరని, చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఉందని అన్నారు. వామపక్ష చరిత్రకారులు మొఘల్ చక్రవర్తుల చరిత్రను  వక్రీకరించి..ఈశాన్య భారతదేశాన్ని, అస్సాంను జయించలేదని చెప్పారని ఆరోపించారు. 

ఈ సందర్భంగా సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నించగా.. సీఎం బిస్వా శర్మ ఈ విధంగా సమాధానమిచ్చారు. "సావర్కర్ చాలా సంవత్సరాలు జైలులో ఉన్నారు. నేడు కొంతమంది ఆయన దేశానికి ఏమి చేశాడని ప్రశ్నిస్తున్నారు.సావర్కర్ సహకారాన్ని ప్రశ్నించడం పాపం, రాహుల్ గాంధీ ఈ పాపం చేయకూడదు" అని అన్నారు. మొఘలుల చేతిలో ఓడిపోయిందని యావత్ భారతదేశాన్ని అంచనా వేయడానికి "వామపక్ష పార్టీల కుట్ర" అని ఆయన అన్నారు.

అంతకుముందు..  గురువారం నాడు'భారత్ జోడో యాత్ర'లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సావర్కర్ బ్రిటిష్ వారికి రాసిన లేఖను చదివి..మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ వంటి నాయకులను కాషాయ సిద్ధాంతకర్త (సావర్కర్) మోసం చేశారని పేర్కొన్నారు. నెహ్రూ , సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారికి సావర్కర్ క్షమాపణ లేఖపై సంతకం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలన రేపుతున్నాయి. దీంతో  రాహుల్ పై థానే నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పలు చోట్ల కాంగ్రెస్, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేజీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్రంగా ఖండించారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి జాతీయ దిగ్గజాలను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ ను ఉందని పేర్కొన్నారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ వ్యాఖ్యలతో స్థానికుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 500, 501 కింద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కేసు నమోదైంది.

click me!