ఏషియా నెట్ ఎక్స్ క్లూజివ్ : భారతీయుల్లో గర్వాన్ని నింపిన ‘వందే భారతం’..

Published : Feb 22, 2022, 04:31 AM ISTUpdated : Feb 22, 2022, 04:38 AM IST
ఏషియా నెట్ ఎక్స్ క్లూజివ్ : భారతీయుల్లో గర్వాన్ని నింపిన ‘వందే భారతం’..

సారాంశం

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల కోసం రూపొందించిన ‘‘వందే భారతం’’ మ్యూజిక్ ఆల్బమ్ ను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో  కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ ఆల్బమ్ స్వరకర్తల్లో ఒకరైన రికీ కేజ్ ‘‘ఏషియా నెట్’’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. 

 గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్, ఆస్కార్ అవార్డు పోటీదారుడైన పెర్కషన్ వాద్యకారుడు బిక్రమ్ ఘోష్ ఇద్ద‌రు క‌లిసి రూపొందించిన ‘వందే భాతరం’ మ్యూజిక్ ఆల్బమ్ ఎన్నో ప్ర‌శంస‌లు అందుకుంటోంది. దీనిని ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ప్లే చేశారు. భార‌త దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 సంత్స‌రాలు పూర్తి చేసుకుంటున్న‌నేప‌థ్యంలో దీనిని ప్ర‌త్యేకంగా రూపొందించారు. అయితే ఈ మ్యూజిక్ ఆల్బ‌మ్ ను సోమవారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ (IGNCA)లో అధికారికంగా విడుదల చేసింది. 

ఈ నేప‌థ్యంలో ‘వందే భార‌తం’ ఆల్బ‌మ్ సృష్టిక‌ర్త‌ల్లో ఒక‌రైన రికీ కేజ్ సోమ‌వారం ‘ఏషియా నెట్’ తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఆయ‌న గ‌తంలో త‌యారు చేసిన ‘విండ్స్ ఆఫ్ సంసార’ ఆల్బ‌మ్ కు గాను 2015లో గ్రామీ అవార్డును. అందుకున్నారు. అయితే ‘వందే భారత్’  ఆల్బ‌మ్ స‌మ‌యంలో ఆయ‌న చేసిన హార్డ్ వ‌ర్క్, ప్రముఖ వాద్య‌కారుడు బిక్ర‌మ్ ఘోష్ తో క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం ఎలా అనిపించిందో.. అస‌లు వారి ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఎలా ఏర్ప‌డిందో వంటి వివ‌రాలు అన్నీ ‘ఏషియా నెట్’ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. 

బిక్రమ్ ఘోష్, మీరు ఇద్దరు కలిసి స్వరపరిచిన ‘వందే భారతం’ అనే మ్యూజిక్ ఆల్బ‌మ్ గురించి మాకు వివ‌రించండి.

రికీ కేజ్: ‘వందే భారతం’ మ్యూజిక్ ఆల్బ‌మ్ ను  జనవరి 26, 2022న రిపబ్లిక్ డే పరేడ్ కోసం నేను, బిక్ర‌మ్ ఘోష్ క‌లిసి తయారు చేశాం. ఇది భారతదేశం అంత‌టా 500 మంది డ్యాన్సర్‌లు, నృత్యం చేసిన అద్భుతమైన ఓపస్ ఈవెంట్. ఈ ఆల్బ‌మ్ లో దేశంలోని ప్రతి ప్రాంతానికి, అన్ని ర‌కాల జానపద, శాస్త్రీయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించేలా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సంగీత విద్వాంసులతో మేము క‌ష్ట‌ప‌డి ప‌ని చేశాం. అయితే దీనిని దీనిని ఒక్క ఈవెంట్ కు మాత్ర‌మే పరిమితం చేయొద్ద‌ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భావించింది. అందుకే ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన అన్ని డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేసింది. 

ఈ పాట కోసం మీరు ఎంత మంది సంగీతకారులతో పని చేసారు ? ఈ కూర్పు వెనుక ఉన్న ఆలోచనలు ఏమిటి?

రికీ కేజ్: భారతదేశంలోని ప్రతీ ప్రాంతం నుండి దాదాపు 40 మంది సంగీతకారులు ఈ ఆల్బ‌మ్ కోసం మాతో క‌లిసి ప‌ని చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనిని రూపొందించాం. భారతీయుల్లో దేశం ప‌ట్ల గర్వాన్ని నింపాల‌ని మేము అనుకున్నాం. దాని కోస‌మే ప‌ని చేశాం. ఎలాంటి సంగీతాన్ని ఇష్ట‌ప‌డేవారైనా దీనిని సులువువ‌గా అర్థం చేసుకునే విధంగా దీనిని రూపొందించాం. ఈ పాట‌ను వేరే దేశం వ్య‌క్తులు వింటున్న‌ప్పుడు భారతీయుల గురించి, భారతదేశ సౌందర్యం దాని సంగీతంపై ఒక మంచి అభిప్రాయం ఏర్ప‌డుతుంది. దీనిని రూపొందించేటప్పుడు మా ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. పాప్ మ్యూజిక్ ఇష్ట‌ప‌డే వారే కాకుండా అందరూ సంగీతాన్ని విని అభినందించాలని మేము కోరుకుంటున్నాము. 

బిక్రమ్ ఘోష్, మీరు కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. మీరిద్దరూ క‌లిసి రిమోట్ తో పని చేసిన‌ప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు ఏమైనా ఉన్నాయా?

రికీ కేజ్: నేను ఇంతకు ముందు ఎప్పుడూ బిక్రమ్‌ని కలవలేదు. కానీ యాదృచ్ఛికంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మమ్మల్ని కలిసి ఈ ఆల్బ‌మ్ ను చేయాల‌ని మ‌మ్మ‌ల్ని కోర‌కముందే మేము ఇద్ద‌రం కోల్‌కతాలో ఓ విందు కోసం కలుసుకున్నాము. రెండు రోజుల త‌రువాత ఈ ఆల్బ‌మ్ చేయాల‌ని మ‌మ్మ‌ల్ని కోరారు. మేము కూడా మొద‌టిసారిగా షాక్ అయ్యాము. త‌రువాత ఆఫ‌ర్ ను అంగీక‌రించాం. ఇద్ద‌రం క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. 

ఈ రోజుల్లో సంగీతకారులు కోవిడ్ కు ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కలిసి రిమోట్‌గా పని చేయడం అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే ప్ర‌తీ చోటుకు ప్రయాణించడం మాకు సాధ్యం కాదు. ఇప్పుడు కూడా అలానే చేశాం. ఈ ప్రత్యేక సందర్భంలో కూడా బిక్రమ్, నేను మా స్టూడియోల నుంచి రిమోట్‌గా పని చేసాము. మేము మొద‌ట మా ఆలోచ‌న‌తో వ‌స్తాం. వాటిని ఒక‌రికొక‌రం షేర్ చేసుకొని డెవ‌ల‌ప్ చేసుకుటంటాం. అది మాకు సంతృప్తిని ఇస్తే దానిని కంపోజ్ చేస్తాం. 

విప్లవ సమయాలతో సహా ప్రజలను బంధించడంలో సంగీతం అంతర్భాగంగా ఉందని మీరు భావిస్తున్నారా?

రికీ కేజ్: సంగీతం సందేశాన్ని కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే కాకుండా శ్రోతల స్పృహలో సందేశాన్ని నిలుపుకోవడానికి కూడా చాలా శక్తివంతమైన భాష అని నేను నమ్ముతున్నాను. అందుకే ప్రపంచమంతటా విప్లవాలు సంగీతం ద్వారా ముందుకెళ్లాయి. భార‌త దేశ స్వాతంత్ర పోరాటాల్లో కూడా పాట‌ల‌కు భాగ‌స్వామ్యం ఉంది. అందువల్ల ఈ ప్రపంచంలోని ప్రతీ దేశం జాతీయ గీతాన్ని కలిగి ఉంటుంది. దేశం మొత్తాన్ని కట్టిపడేసేది సంగీతం. జాతీయ గీతం గ‌ర్వం, దేశభక్తి భావాన్ని కలిగిస్తుంది. సంగీతాన్ని తెలివిగా ఉపయోగించినట్లయితే అది చాలా బలమైన ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి సంగీతం ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. 

ఈ ఆల్బ‌మ్ కంపోజ్ చేసిన స‌మ‌యంలో మీకు గుర్తున్న ప్రత్యేక క్షణం ఉందా?

రికీ కేజ్ :  మేము ఈ ఆల్బ‌మ్ రూపొందిస్తున్న‌ప్పుడు టైం పీరియెడ్ మాకు ఆందోళన కలిగించేది. ఇది రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగం కాబట్టి మాకు 12 నిమిషాల టైమ్ స్లాట్ ఇచ్చారు. అయితే ఈ ఆల్బ‌మ్ లో చాలా స‌మాచారం, సంగీతం, భ‌విష్య‌త్ ఆలోచ‌న‌లు ఉన్నందున 12 నిమిషాల్లో అన్నింటినీ సరిపోల్చడం కొంత సమస్యగా మారింది. దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఆల్బమ్ విడుద‌ల అయినప్పుడు చాలా సంతోషించాం. 

AR రెహమాన్ ‘వందేమాతరం’ వెర్షన్.. ’మా తుజే సలామ్‘ దేశం  హృదయాన్ని తాకింది. ‘వందే భారతం’ ప్రేక్షకులు ఎలా స్వీక‌రిస్తార‌ని మీరు భావిస్తున్నారు. ? 

రికీ కేజ్ : ఇది (వందే భారతం) చాలా వరకు వాయిద్యంతో ఉంది. అందువలన ఇది ఒక పాట కంటే సంగీత భాగాన్నివర్గీకరిస్తుంది. ఇది ప్ర‌జ‌ల‌పై కొంత ప్ర‌భావం చూపించిన‌ప్పటికీ ‘మా తుజే సలామ్’ అంత ప్రభావం చూపక‌పోవ‌చ్చు. మాది ప్రాథమికంగా మ్యూజికల్ పీస్. భారతదేశం సంప్రదాయాలు, భావోద్వేగాలను చాలా చక్కగా పొందుప‌ర్చి ఉన్నాయి. కాబ‌ట్టి ప్రజలు మెచ్చుకుంటారని, ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. భార‌త్ లోని చాలా నృత్య బృందాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఫంక్షన్ల సమయంలో కొరియోగ్రఫీల కోసం దీనిని ఉప‌యోగిస్తార‌ని నేను భావిస్తున్నాను. ఈ సంగీతం మిమ‌ల్ని మ‌రో ప్ర‌పంచానికి తీసుకెళ్తుంది. ఇది మీ మానసిక స్థితిని పూర్తిగా ఎలివేట్ చేయగల ఒక రకమైన సంగీతం. ఇది భారతీయుడిగా మీ గ‌ర్వాన్ని పెంచుతుంది. 

రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈ సంగీతాన్నిప్లే చేసినప్పటి నుంచి చాలా ప్రశంసలను అందుకుంటోంది. ఈ విష‌యంలో మీకు ఎలా అనిపిస్తుంది. ? 

రికీ కేజ్: ప్రతీ చోటా ప్రశంసలు విపరీతంగా వ‌స్తున్నాయి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒకసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సంగీతాన్ని నిజంగా ప్రపంచ స్థాయికి చేర్చినట్లు చెప్పారు. ఆ ప్రకటన నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఇది ప్రపంచ స్థాయి అని, అతను విన్న అత్యుత్తమ సంగీత భాగాలలో ఒకటి అని చెప్పడం నాకు చాలా గ‌ర్వంగా అనిపించింది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌