టిప్పు సుల్తాన్‌కు మద్దతిస్తే.. చంపేస్తారా: కర్ణాటక బీజేపీ చీఫ్‌పై విరుచుకపడ్డ ఒవైసీ  

Published : Feb 18, 2023, 10:55 PM ISTUpdated : Feb 18, 2023, 10:56 PM IST
 టిప్పు సుల్తాన్‌కు మద్దతిస్తే..  చంపేస్తారా: కర్ణాటక బీజేపీ చీఫ్‌పై విరుచుకపడ్డ ఒవైసీ  

సారాంశం

టిప్పు సుల్తాన్‌పై భారతీయ జనతా పార్టీ (బిజెపి) కర్ణాటక చీఫ్ ఇటీవల చేసిన ప్రకటనను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. తమకు అవకాశం ఉంటే టిప్పు సుల్తాన్ చిత్రపటాన్ని కలిగి ఉన్న రాజ్యాంగం యొక్క మొదటి కాపీలను బిజెపి తగలబెడుతుందా అని AIMIM నాయకుడు ప్రశ్నించారు .

టిప్పు సుల్తాన్‌ వివాదంలో ఒవైసీ: కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వివాదంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కర్నాటకలో అవినీతి ప్రధాన సమస్య అని, అయితే టిప్పు సుల్తాన్ విషయంలో అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. టిప్పు సుల్తాన్ పేరు చెబితే చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఇంతకు ముందు ఒవైసీ కర్ణాటకలో బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌ను టార్గెట్ చేశారు. టిప్పు సుల్తాన్ మద్దతుదారులను హతమార్చాలని పిలుపునిచ్చిన కర్ణాటక బీజేపీ చీఫ్ అభిప్రాయాలను ప్రధాని మోదీ పంచుకున్నారా? అని ఒవైసీ ప్రశ్నించారు. ఈ ప్రకటన మారణహోమానికి పిలుపునిచ్చిందని, ద్వేషాన్ని వ్యక్తపరిచే ప్రకటనగా ఆయన అభివర్ణించారు.

‘నేను టిప్పు సుల్తాన్‌కు మద్దతిస్తే నన్ను చంపేస్తారా?’ అని కర్ణాటక బీజేపీ చీఫ్‌ నళిన్ కుమార్ ని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం మొదటి కాపీలో టిప్పు సుల్తాన్, రాముడు, లక్ష్మణ్, గౌతమ బుద్ధుడు, అక్బర్, గురునానక్, ఝాన్సీ రాణి వంటి అనేక మంది చారిత్రక వ్యక్తుల చిత్రాలు ఉన్నాయని ఒవైసీ హైలైట్ చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించిన వారు బిజెపి కంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని, బిజెపి రాజ్యాంగాన్ని తగలబెట్టవచ్చని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.  

అంతేకాకుండా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. తాము కొత్తగా నిర్మించిన రాష్ట్ర సచివాలయాన్ని కూల్చివేస్తామని బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడంపై స్పందించారు. ఈ ప్రకటనపై ఒవైసీ విమర్శించారు. ఒవైసీ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మెరుగైన పాలనకు మద్దతు ఇవ్వడానికి బదులుగా రాష్ట్ర సచివాలయాన్ని నాశనం చేయడంపై బిజెపి దృష్టి పెట్టడాన్ని ప్రశ్నించారు.

టిప్పు సుల్తాన్ సమస్యపై రచ్చ

తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని, రాముడు, హనుమంతుడి భక్తులమని, టిప్పుసుల్తాన్ వారసులను ఇంటికి పంపిస్తామని కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ పేర్కొన్నారు. తాను హనుమంతుని భూమిపై సవాలు చేస్తున్నాననీ, టిప్పుసుల్తాన్ ను ప్రేమించే వ్యక్తులు ఇక్కడ ఉండకూడదనీ, రామభజన చేసేవారు, హనుమంతుడిని ప్రార్థించే వారు మాత్రమే..  ఇక్కడే ఉండాలని నళిన్ కటీల్ స్పష్టం చేశారు.

నళిన్ కుమార్ కటీల్ చేసిన సంచలన ప్రకటనతో ఆ రాష్ట్ర రాజకీయ శిబిరంలో కలకలం రేగింది. ఒవైసీ కంటే ముందు కాంగ్రెస్ కూడా ఈ విషయంపై బీజేపీపై విరుచుకుపడింది. భౌతిక హింసపై మాకు నమ్మకం లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు. తాము ప్రజాస్వామ్యం,  శాంతిని మాత్రమే విశ్వసిస్తామనీ, బుజ్జగింపు రాజకీయాలకు తాము అంగీకరించబోమని అన్నారు.  

అదే సమయంలో కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్‌ నారాయణ్‌ వివాదాస్పద ప్రకటన చేశారు. సిద్దరామయ్యను టిప్పు సుల్తాన్ తో పోల్చారు. టిప్పు సిద్ధరామయ్య ఉరిగౌడ, నంజెగౌడ చేతిలో టిప్పుసుల్తాన్ లా ఓడిపోతాడని నారాయణ్ వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం