కేంద్రం సహకారం, ప్రధాని ఆశీర్వాదం కావాలి: ​అరవింద్ కేజ్రీవాల్

By Rajesh KarampooriFirst Published Dec 7, 2022, 5:06 PM IST
Highlights

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది. ఢిల్లీలో అప్ అభ్యర్థి తొలిసారి మేయర్ కాబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 134 వార్డులను గెలుచుకోగా..  బీజేపీ అభ్యర్థులు 103 వార్డుల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 8 వార్డుల్లో విజయం సాధించగా.. మరో రెండు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు మూడుచోట్ల విజయం సాధించారు. 

 

 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ  పార్టీ (APP) ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డులున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అప్ ఏకంగా  134 వార్డులు సొంతం చేసుకుంది. ఈ ఘన విజయంతో ఢిల్లీ కార్పోరేషన్ లో గత 15 ఏండ్ల బీజేపీ పాలనకు తెరపడింది. ఎన్నికల విజయం తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ పరిశుభ్రతకు ప్రధాని ఆశీస్సులు కావాలని సీఎం అన్నారు. 

ఇంతటీ అపూర్వ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు తమ కొడుకు, వారి సోదరుడిని ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించడానికి అర్హులుగా భావించారనీ అన్నారు. ఢిల్లీ ప్రజలు గతంలో తమకు విద్య, ఆరోగ్యం, విద్యుత్ బాధ్యతలను ఇచ్చారనీ. వాటిని సమర్థవంతంగా పూర్తి చేశామన్నారు. నేడు.. అదే  ప్రజలు దేశ రాజధానిని పరిశుభ్రం చేయడం. అవినీతిని తొలగించడం, పార్కులను బాగు చేయడం వంటి బాధ్యతను మాకు అప్పగించారని, వాటిని కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తామన్నారు.

గెలుపొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి పనిచేయాలని..బీజేపీ,కాంగ్రెస్ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నానని కేజ్రీవాల్ అన్నారు. తమకు ఓటు వేసిన వారికి, ఓటు వేయని వారికి సేవ చేయాలనే వచ్చామని అన్నారు. ’’ఢిల్లీని చక్కదిద్దాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి.. ప్రధాని ఆశీస్సులు కావాలి.. ఢిల్లీని శుభ్రం చేయాలి.. చెత్తాచెదారం లేకుండా చేయాలి.. కోట్లాది మంది కుటుంబాలను క్లీనింగ్ చేస్తాం’’ అని ఆప్ అధినేత అన్నారు. 

దేశానికి ఢిల్లీ ప్రజలు సందేశం ఇచ్చారు :కేజ్రీవాల్

ఈ ఘన విజయంతో దేశానికి ఢిల్లీ ప్రజలు మరోసారి సందేశం ఇచ్చారని అన్నారు. అవినీతిని పారద్రోలాలి.. దోపిడీని అంతం చేయాలి.. ఢిల్లీ ప్రభుత్వాన్ని శుభ్రం చేసినట్లే మునిసిపల్‌ కార్పొరేషన్‌ను కూడా శుభ్రం చేయాలని ఢిల్లీ ప్రజలు యావత్‌ దేశానికి సందేశం ఇచ్చారని అన్నారు. తాము దుర్వినియోగం చేయడానికి రాలేదని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మమ్మల్ని ఎవరూ రెచ్చగొట్టరు, దుర్వినియోగం చేయం. సమస్యలపై ఎన్నికల్లో పోరాడాం. అహంకారం ఉండకూడదని నా ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని,అహంకారం గొప్ప వ్యక్తుల పతనానికి దారి తీస్తుందని అన్నారు. 

విజయం తర్వాత మనీష్ సిసోడియా ఏమన్నారు?

ఢిల్లీ ఎంసీడీలో ఆమ్ ఆద్మీ పార్టీని విశ్వసించినందుకు ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ,అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా ఢిల్లీ ప్రజలు నిజాయితీపరుడైన, పని చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు.. పెద్ద బాధ్యత అని అన్నారు.

ఆప్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు 

ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీతో విజయం సాధిస్తుంది. ఎన్నికల సంఘం తాజా సమాచారం ప్రకారం మొత్తం 250 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 వార్డులను గెలుచుకుంది. గత 15 సంవత్సరాలుగా అంటే 2007 నుండి MCDని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) 104 సీట్లు గెలుచుకుంది. 10మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 3 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. తుది ఫలితాలు వెలువడకముందే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ కూడా కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వెలుపల కార్మికులు గుమిగూడి నినాదాలు చేస్తున్నారు.

click me!