డిల్లీ సీఎం కేజ్రీవాల్ కారుపై దాడి...

By Arun Kumar PFirst Published Feb 8, 2019, 7:20 PM IST
Highlights

దేశ రాజధాని డిల్లీలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై కొందరు ఆందోళనకారులు దాడికి ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్న ఆందోళనకారులు ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కేజ్రీవాల్ కు ఎలాంటి హాని జరగలేదు. 

కేజ్రీవాల్ నరేలా నియోజకవర్గంలో అభివృద్ది పనుల ప్రారంభోత్సవం కోసం పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది. కేజ్రీవాల్ రాకపై సమాచారంతో ఓ 100 మంది ఆందోళనకారులు ముందుగానే గుమిగూడారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ కాన్వాయ్ అటువైపు రావడంతో ఒక్కసారిగా అడ్డుకున్నారు. వెంటనే కేజ్రీవాల్ వాహనం వద్దకు చేరుకుని దాన్ని చుట్టుముట్టి కర్రలతొ దాడికి పాల్పడ్డారు. 

దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, ఎస్కార్ట్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దాడి నుండి కేజ్రీవాల్ సురక్షింతంగా బయటపడ్డాడు. అలాగే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తమ నాయకుడిపై జరిగిన దాడిని ఆప్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి బిజెపి కార్యకర్తల పనేనని వారు ఆరోపిస్తున్నారు.  

click me!