లిక్కర్ స్కాంలో ఈడీకిచ్చిన వాంగ్మూలం వెనక్కి: కోర్టులో పిటిషన్ వేసి ట్విస్టిచ్చిన పిళ్లై

By narsimha lode  |  First Published Mar 10, 2023, 1:14 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  శుక్రవారంనాడు కీలక మలుపు తిరిగింది.  ఈడీకి  ఇచ్చిన వాంగ్మూలాన్ని  ఉపసంహరణకు  పిటిషన్ దాఖలు  చేశారు.  


న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ స్కాంలో  శుక్రవారం నాడు  కీలక  పరిణామం చోటు  చేసుకుంది.  గతంలో  ఈడీకి  ఇచ్చిన  వాంగ్మూలాన్ని  ఉపసంహరించుకోవడానికి  అరుణ్ రామచంద్రపిళ్లై  పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై  ఢిల్లీలోని  రౌస్ అవెన్యూ కోర్టు  ఈడీకి నోటీసులు జారీ చేసింది. 

ఈ నెల  6వ తేదీన  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. ఈ నెల  7వ తేదీన కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అనుమతితో  ఈడీ అరుణ్ రామచంద్ర పిళ్లైని  కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest Videos

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవిత ప్రతినిధిగా  తాను వ్యవహరించినట్టుగా  అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలం ఇచ్చినట్టుగా ఈడీ అధికారులు  కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు.   ఢిల్లీ లిక్కర్ స్కాంలో   సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని  దర్యాప్తు  సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా  దర్యాప్తు  సంస్థలు విచారణ చేస్తున్నాయి. 

గతంలో  కూడా పలు దఫాలు ఈడీ విచారణకు  అరుణ్ రామచంద్రపిళ్లై హాజరయ్యారు. ఈ నెల  6వ తేదీన అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. నాలుగు రోజులుగా  ఈడీ అధికారులు అరుణ్ రామచంద్రపిళ్లైని విచారిస్తున్నారు.

అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టైన మరునాడే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఈడీ అధికారుల నోటీసులు ఇచ్చారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలున్నందున ఈ నెల  9వ తేదీన విచారణకు  రాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు.ఈ నెల  11న ఈడీ విచారణకు హాజరుకానున్నట్టుగా  సమాచారం ఇచ్చారు. ఈ తరుణంలో  అరుణ్ రామచంద్రపిళ్లై ఢీల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో  దాఖలు  చేసిన పిటిషన్   ప్రాధాన్యత సంతరించుకుంది.
 

click me!