సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్: జవాన్ మృతి

Published : Aug 17, 2019, 05:51 PM IST
సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్: జవాన్ మృతి

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో పాక్ కాల్పులకు దిగింది.ఈ ఘటనలో భారత సైనికుడు మృతి చెందాడు. 

శ్రీనగర్: పాకిస్తాన్ మూకలు మరోసారి కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందాడు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ కాల్పులకు దిగింది.

జమ్మూలోని  రాజౌరీ జిల్లా నౌషీరా సెక్టార్ లో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు శనివారం నాడు కాల్పులకు దిగారు.  మోర్టాల్స్ షెల్స్ ప్రయోగించారు. తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగారు పాక్ సైనికులు.

పాక్ కాల్పుల్లో భారత్ కు చెందిన  ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు.మృతి చెందిన సైనికుడిని డెహ్రాడూన్‌కి చెందిన లాన్స్‌నాయక్ సందీప్ తాపాగా గుర్తించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు సైనిక వర్గాలు వెల్లించాయి.

శనివారం ఉదయం ఆరుగంటల సమయంలో పాక్ సైనికులు కాల్పులకు దిగినట్టుగా సైనిక వర్గాలు తెలిపాయి.పాక్ కాల్పులను భారత్ సైనికులు ధీటుగా తిప్పికొట్టారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !