
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి Stalin దృష్టిని ఓ Andhra student ఆకర్షించాడు. స్టాలిన్ గురువారం ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి కారులో బయలుదేరారు. TTK Roadలో ‘సీఎం సార్ హెల్ప్ మీ’ అనే ప్లకార్డు పట్టుకుని ఉన్న ఓ యువకుడు కనిపించాడు. వెంటనే కారు ఆపమని, యువకుడిని పిలిపించి స్టాలిన్ మాట్లాడారు. అతను East Godavari Districtకు చెందిన ఎన్.సతీష్ అని తెలిసింది. నీట్ ను వ్యతిరేకిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలా ప్లకార్డు పట్టుకుని నిలుచున్నానని యువకుడు చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినా నీట్ కారణంగా వైద్యవిద్యకు దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. నీట్ రద్దుకు చట్టపరమైన పోరాటాలు జరుగుతున్నాయని ఆ విద్యార్థికి సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో గళం వినిపిస్తున్నట్టు కూడా తెలిపారు. నమ్మకంతో ఊరికి తిరిగి వెళ్లాలి అంటూ ఆ విద్యార్థికి స్టాలిన్ సూచించారు.
ఇదిలా ఉండగా, జనవరి 7న ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ నిబంధనల మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి నీట్, పీజీ, యూజీ కోర్సుల కౌన్సెలింగ్ ను పున: ప్రారంభించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు అనుమతించింది. ఓబీసీకి 27 శాతం, ఈడబ్ల్యూఎస్ లకు 10శాతం రిజర్వేషన్ కోటాను సమర్థించింది. EWSపై పాండే కమిటీ నిర్దేశించిన ప్రమాణాల చెల్లుబాటును పరిశీలించాలని కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్ల జాబితాపై ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది.
సుప్రీంకోర్టు జస్టిస్ Dy chandrachud, justice ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం రెండు రోజులపాటు విస్తృత వాదనలు విన్నది. ఈ వాదనలు విన్న తర్వాత జనవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులను గుర్తించేందుకు రూ.8 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఏడాదికి అనుమతించింది. ఉన్నత న్యాయస్థానం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, గుర్తింపు ప్రమాణాలపై వివరణాత్మక విచారణ జరపనుంది.
ఈ అడ్మిషన్లు సుప్రీం కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయి. దీనికి ముందు వారం జరిగిన విచారణతో పాటు గతంలో జరిగిన విచారణలో ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ప్రమాణాలను ఈ విద్యా సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. నీట్ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ సాగుతున్న సమయంలో నిబంధనలను మార్చడం సంక్లిష్టతలను దారితీస్తోందని కేంద్ర ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సవరించిన నిబంధనలను వచ్చే ఏడాది నుండి వర్తింప చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఈడబ్ల్యూఎస్ కింద లబ్ధిదారుల విషయంలో కేంద్రం కొన్ని సవరణలను తీసుకు వచ్చింది. ఏటా 8 లక్షల వార్షిక ఆదాయాన్ని పేర్కొంది. అయితే ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు ఎకరాల భూమి అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు మినహాయింపు ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ లలో లబ్ది దారులను గుర్తంచడానికి ఏటా రూ.8లక్షల వార్షికాదాయాన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు అఫిడవిట్ జత చేసింది. రూ. 8 లక్షల వార్షికాదాయం ప్రమాణాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15,16కి అనుగుణంగా ఉందని గతంలో ప్రభుత్వం వాదించింది.