Published : Jun 04, 2024, 06:01 AM ISTUpdated : Jun 04, 2024, 11:36 PM IST

Election results 2024 Live: ఆంధ్రప్రదేశ్ లో కూటమి, కేంద్రంలో ఎన్డీయే

సారాంశం

ఏసియానెట్ తెలుగు ఎన్నికల లైవ్ బ్లాగ్‌కి స్వాగతం. దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు వచ్చేశాయి. అయితే మంగళవారం ఈ ఫలితాల తీరు ఎలా ఉండిందో.. మీరిక్కడ చూడవచ్చు. 

Election results 2024 Live: ఆంధ్రప్రదేశ్ లో కూటమి, కేంద్రంలో ఎన్డీయే

05:24 PM (IST) Jun 04

దేశంలోనే అమిత్‌ షా కు రికార్డు మెజార్టీ..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024లో  బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందారు. గుజరాత్ లోని  గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన అమిత్ షా 7 లక్షల 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
 

05:06 PM (IST) Jun 04

"ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో నీకు తెలుసు..": పవర్ స్ఠార్ కు మెగాస్టార్ విషెస్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి తన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు.  తన ట్విట్టర్ ఖాతాలో ఇలా ట్విట్ చేశారు. ’’డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా  అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన  ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ  కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని  నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో  నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.’’  అంటూ పోస్ట్  చేశారు.
 

04:58 PM (IST) Jun 04

చంద్రబాబుకు చిరంజీవి అభినందనలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కూటమి విజయం సందర్భంగా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ’’ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు  ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ  మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. !’’ అంటూ చిరు ట్వీట్ వేశారు.
 

04:54 PM (IST) Jun 04

మంగళగిరిలో నారా లోకేష్‌ భారీ ఆధిక్యం..

15 రౌండ్లు ముగిసేసరికి  నారా లోకేష్‌ 70 వేలకుపైగా ఓట్ల పై చిలుకు ఆధిక్యంలో ఉన్నారు.

04:47 PM (IST) Jun 04

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకున్న జనసేనాని

ఏపీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించార. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలు చేరబోతున్నారు. 
 

04:15 PM (IST) Jun 04

వరంగల్‌లో కడియం కావ్య విజయదుందుభి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు తగ్గట్లుగానే కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పలు చోట్ల నువ్వా.. నేనా అన్నట్టు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుపొందగా.. మరో రెండు స్థానాల్లో  ఆధిక్యంలో కొనసాగుతోంది. వరంగల్‌లో కడియం కావ్య రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.  
 

04:11 PM (IST) Jun 04

రెండు చోట్ల రాహుల్ గాంధీ భారీ విజయం​..

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలుపొందారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీ సాధించారు. అటు ఉత్తర ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
 

04:02 PM (IST) Jun 04

గుడివాడలో కొడాలి నాని ఘోర పరాజయం

గుడివాడలో టీడీపీ నుంచి పోటీ చేసిన వెనిగండ్ల రాము 51 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

03:58 PM (IST) Jun 04

నల్గొండలో జానారెడ్డి కుమారుడు భారీ విజయం.. వైఎస్ జగన్ రికార్డు బ్రేక్

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డి రికార్డు విక్టరీ సాధించారు.బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 5.51 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. 2011లో కడప లోక్‌సభ ఉపఎన్నికలో 5.43 లక్షల మెజార్టీతో గెలిచిన జగన్‌ రికార్డు ను బ్రేక్ చేశారు. 
 

03:47 PM (IST) Jun 04

గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన జగన్.. కాసేపట్లో సీఎం పదవికి రాజీనామా..

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో గవర్నర్ ను కలిసి జగన్ తన రాజీనామా లేఖను అందించనున్నారు .
 

03:34 PM (IST) Jun 04

అసదుద్దీన్ ఓవైసి విజయం

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ 3,15,811 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మాధవి లత పై విజయం..

03:00 PM (IST) Jun 04

తెలంగాణ కాంగ్రెస్  విజయ బావుటా.. గెలుపొందిన స్థానాలివే..

ఖమ్మంలో నామా నాగేశ్వరరావుపై రఘురాంరెడ్డి (కాంగ్రెస్‌) విజయం

వరంగల్‌లో అరూరి రమేశ్‌పై కడియం కావ్య (కాంగ్రెస్‌) విజయం

నల్గొండలో సైదిరెడ్డిపై కుందూరు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్‌) విజయం

మహబూబాబాద్‌లో మాలోతు కవితపై బలరాం నాయక్‌ (కాంగ్రెస్‌) విజయం

జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌పై సురేష్‌ షెట్కార్‌ (కాంగ్రెస్‌) విజయం

ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయం
 
 

02:44 PM (IST) Jun 04

డోన్ లో బుగ్గన రాజేంద్ర నాథ్ ఓటమి

డోన్ లో బుగ్గన రాజేంద్ర నాథ్ ఓటమి 

బుగ్గన పై కోట్ల సూర్యప్రకాశ్ గెలుపు 

6450 ఓట్ల అధిక్యం
 

02:24 PM (IST) Jun 04

పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం దిశగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఆయన 50వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. దీంతో ఆయన విజయం ఖాయమయిపోయింది. 

02:16 PM (IST) Jun 04

ఇప్పటివరకు గెలిచిన టిడిపి అభ్యర్థులు వీరే....

ఉరవకొండలో పయ్యావుల కేశవ్, రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు, చింతలపూడిలో సొంగ రోషన్, ఉండిలో రఘురామ కృష్ణంరాజు, విశాఖ వెస్ట్ గణబాబు విజయం సాధించారు. 
 

01:48 PM (IST) Jun 04

తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ హోరాహోరీ ... ఎక్కడ ఎవరి ఆధిక్యం వుందంటే...

తెలంగాణలో లోక్ సభలు, పార్టీలు, అభ్యర్థుల వారిగా ఎవరు, ఎంత ఆధిక్యంలో వున్నారంటే... 

బిజెపి అభ్యర్థులు :

నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ కు 1,00,760 ఓట్ల ఆధిక్యం 

మహబూబ్ నగర్ లో డికె అరుణకు 14,915 ఓట్ల ఆధిక్యం 

ఆదిలాబాద్ లో గోడం నగేష్  63,350 ఓట్ల ఆధిక్యం 

కరీంనగర్ లో బండి సంజయ్ 1,53,316 ఓట్ల ఆధిక్యం 

మెదక్ లో రఘునందర్ రావు  31,817 ఓట్ల ఆధిక్యం

మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ 2,44,165 ఓట్ల ఆధిక్యం

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి   1,15,184 ఓట్ల ఆధిక్యం

సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి 49,254 ఓట్ల ఆధిక్యం

కాంగ్రెస్ అభ్యర్థులు :

ఖమ్మంలో రఘురామ్ రెడ్డికి 4,11,219 ఓట్ల ఆధిక్యం 

మహబూబాబాద్ లో బలరాం నాయక్ కు 2,98,178 ఓట్ల ఆధిక్యం 

భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి 1,53,067 ఓట్ల ఆధిక్యం 

నాగర్ కర్నూల్ లో మల్లు రవికి 69,629 ఓట్ల ఆధిక్యం 

పెద్దపల్లిలో గడ్డం వంశీకి 96,655 ఆధిక్యం

జహిరాబాద్ లో సురేశ్ షెట్కార్ కు 31,629 ఓట్లు 

వరంగల్ లో కడియం కావ్య  1,58,977 ఓట్ల ఆధిక్యం 

హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసికి  2,12,334 ఓట్ల ఆధిక్యం

01:32 PM (IST) Jun 04

చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్...

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి విజయం ఖాయం కావడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  అలాగే అమిత్ షా కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందించారు. టిడిపి కూటమి ఘనవిజయం ఖాయమైన నేపథ్యంలో టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. 

01:29 PM (IST) Jun 04

ఎన్డిఏ కూటమి 300 చోట్ల ఆధిక్యం..

ఎన్డిఏ కూటమి 300 సీట్లలో ఎన్డిఏ ఆధిక్యంలో వున్నట్లు ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. ఇండి కూటమి 225 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 

01:13 PM (IST) Jun 04

గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్..

వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. ఆయన రాజ్ భవన్ కు చేరుకుని రాజీనామాను సమర్పించనున్నారు.
 

01:06 PM (IST) Jun 04

కొవ్వూరులో టిడిపి, అనపర్తిలో బిజెపి విజయం....

కొవ్వూరులో టిడిపి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, అనపర్తిలో బిజెపి అభ్యర్థి నల్లమిల్లి  రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. 


 

12:48 PM (IST) Jun 04

పులివెందులలో జగన్ ఆధిక్యం...

8వ రౌండ్ ముగిసేసరికి పులివెందులలో వైఎస్ జగన్ ఆధిక్యం 27,430 ఓట్లుగా వుంది. 

12:44 PM (IST) Jun 04

చంద్రబాబు కంటే నారా లోకేష్ ఆధిక్యమే అధికం...

నారా లోకేష్ 18 వేలు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ 20వేల ఓట్ల ఆధిక్యంలో వుంది. ఇక పిఠాపురంలో పవన్ కల్యాణ్ 52, కుప్పంలో చంద్రబాబు నాయుడు 11 వేల ఆధిక్యంలో వున్నారు. 

12:26 PM (IST) Jun 04

చంద్రబాబు ప్రమాణస్వీకారం జూన్ 9నే?

తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజారిటీతో విజయం ఖాయమయ్యింది. దీంతో వైసిపి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ప్రకటించిన జూన్ 9నే చంద్రబాబు ప్రమాణస్వీకారం వుంటుందని తెలుస్తోంది. ఈమేరకు టిడిపి వర్గాలనుండి సమాచారం అందుతోంది. 


 

11:59 AM (IST) Jun 04

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు లాంఛనమే...

పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం దాదాపు ఖరారయ్యింది. ఆయన ప్రస్తుతం 40వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.   
 

11:48 AM (IST) Jun 04

జనసేన కంటే దిగువకు వైసిపి... కూటమి 162 సీట్ల ఆధిక్యం

వైసిపి పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ కేవలం 13 చోట్ల మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. టిడిపి 135, జనసేన 20, బిజెపి 7 చోట్ల అంటే ఎన్డిఏ కూటమి 162 చోట్ల ఆధిక్యంలో వుంది. తుది ఫలితాలు ఇలాగే వుంటే 2019 లో వైసిపి అత్యధిక సీట్ల రికార్డును ఎన్డిఏ కూటమి బద్దలుగొట్టి అధికారంలోకి రానుంది. 
 

11:42 AM (IST) Jun 04

టిడిపి కూటమి తొలి విజయం...

తెలుగుదేశం పార్టీ విజయాల ఖాతా తెరిచింది.  రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. అలాగే రాజమండ్రి సిటీలో టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం సాధించారు. 61,500 ఓట్ల మెజారిటీతో గోరంట్ల విజయం సాధించారు.

11:38 AM (IST) Jun 04

దగ్గుబాటి పురంధేశ్వరికి భారీ మెజారిటీ...

ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందీశ్వరి భారీ ఆధిక్యంత విజయం దిశగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె లక్షా 20వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 

11:22 AM (IST) Jun 04

జిల్లాలవారిగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఆధిక్యం...

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి రాష్ట్రంలో దాదాపు 150కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 

ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే : 

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 సీట్లుంటే టిడిపి 8, బిజెపి 1, వైసిపి 1 చోట ఆధిక్యం. 

విజయనగరం జిల్లాలో మొత్తం  9 సీట్లుంటే టిడిపి 7, జనసేన 1, వైసిపి 1 ఆధిక్యం  

విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 సీట్తుంటే టిడిపి 8, జనసేన 4, బిజెపి 1, వైసిపి 2 ఆధిక్యం

తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లుంటే టిడిపి 13, జనసేన 5, వైసిపి 1 ఆధిక్యం 

పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లకు గాను టిడిపి 8 , జనసపేన 5, వైసిపి 2 ఆధిక్యం 

కృష్ణా జిల్లాలో మొత్తం 16 సీట్లకు గాను టిడిపి 13, బిజెపి 2, జనసేన 1 ఆధిక్యం

గుంటూరులోమొత్తం 17 సీట్లకు గాను  టిడిపి 16, జనసేన 1 ఆధిక్యం 

అంటే గుంటూరు, కృష్ణా జిల్లల్లో టిడిపి క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది.

 
 

11:02 AM (IST) Jun 04

విజయం దిశగా నారా లోకేష్...

నారా లోకేష్ 11,700 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. మంగళగిరిలో ఇప్పటివరకు మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది.

10:58 AM (IST) Jun 04

రాయలసీమలో టిడిపి క్లీన్ స్వీప్...

రాయలసీమలో వైసిపి చతికిలపడింది. ఇక్కడ 52 సీట్లుంటే కేవలం  ఐదుచోట్ల మాత్రమే వైసిపి ముందంజలో వుంది. టిడిపి కూటమి ఏకంగా 47 చోట్ల ఆధిక్యంలో వున్నాయి. పులివెందులలో వైఎస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:55 AM (IST) Jun 04

తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ ల మధ్య  హోరాహోరీ

తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ ల మధ్య  హోరాహోరీగా  సాగుతోంది. 

కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 51 వేల ఆధిక్యం 

వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య  34 వేల ఆధిక్యం 

మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 32 వేల ఆధిక్యం 

భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 26 వేల ఆధిక్యం 

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి 16 వేల ఆధిక్యం 

మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్   1,40,000 వేల భారీ ఆధిక్యం 

 మహబూబ్ నగర్ లో డికె అరుణ  ఆధిక్యం 


 

10:48 AM (IST) Jun 04

శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు విజయం ఖాయం...

శ్రీకాకుళం లోక్ సభలో టిడిపి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు 46,858 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

10:43 AM (IST) Jun 04

టిడిపి కూటమి విజయం ఖాయం... సంబరాలు మొదలయ్యాయి...

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి కూటమి 155  చోట్ల విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు,  కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. టిడిపి శ్రేణులు పసుపు జెండాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. 

 

10:32 AM (IST) Jun 04

మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ...

మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుకంజలో వున్నారు. అలాగే అముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజలో వున్నారు. 
 

10:28 AM (IST) Jun 04

వారణాసిలో మోదీ ఆధిక్యం...

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయన ప్రస్తుతం 16 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 

10:24 AM (IST) Jun 04

విజయం దిశగా బండి సంజయ్

కరీంనగర్ లో బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఆయన ఆధిక్యం 25 వేలు దాటింది. 

 

10:17 AM (IST) Jun 04

కడపలో టిడిపి భారీ ఆధిక్యం.... గెలుపుదిశగా..

కడప అసెంబ్లీలో టిడిపి విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక్కడ టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డి 10వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:10 AM (IST) Jun 04

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి కూటమిదే...  భారీ ఆధిక్యం

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. 45 శాతం టిడిపికి, 40 శాతం వైసిపి ఓటింగ్ వుంది. ఇక జనసేన 7 శాతం, బిజెపి 3 శాతం ఓట్లు సాధించింది. దీంతో టిడిపి 138 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసిపి 21 చోట్ల మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 


 

10:03 AM (IST) Jun 04

గోరంట్ల బుచ్చయ్య విజయం ఖాయమే... 25వేల ఆధిక్యం...

రాజమండ్రి రూరల్ లో టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపుకు చేరువలో వున్నారు. ఆయన ఆధిక్యం 25,600 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  

09:59 AM (IST) Jun 04

ఎట్టకేలకు మోదీ ముందంజ...

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ  436 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. మొదటి రౌండ్ లో వెనుకంజలో వున్న మోదీ రెండో రౌండ్ ముగిసేసరికి మోదీ ముందంజలోకి వచ్చారు.  


More Trending News