UP Elections 2022: దేశ భవితవ్యాన్ని నిర్ణయించేవి యూపీ ఎన్నికలే: అమిత్ షా

By Rajesh KFirst Published Jan 27, 2022, 4:43 PM IST
Highlights

UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని దేశ భవితవ్యాన్ని నిర్దేశిస్తాయ‌ని కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో  మ‌రోసారి అధికారంలోకి చేజిక్కించుకోవాల‌ని బీజేపీ  ప్రయత్నిస్తోంది. యూపీలో  వారసత్వవాదుల నుంచి కులవాదుల నుంచి యూపీలోఅమిత్ షా అన్నారు. ఇప్పుడు యూపీలో కొనసాగుతున్నదంతా అభివృద్ధేనని అన్నారు. 
 

UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని దేశ భవితవ్యాన్ని నిర్దేశిస్తాయ‌ని కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో  మ‌రోసారి అధికారంలోకి చేజిక్కించుకోవాల‌ని బీజేపీ  ప్రయత్నిస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గురువారం మధురలో అమిత్ షా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేష్‌ను మళ్లీ గెలిపిస్తే.. గ్యాంగ్‌స్టర్లు, నేరగాళ్లకు భయపడే కాలం ఉండేదని అమిత్ షా    విమర్శించారు.
 
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. నేడు మధురలో బృందావన్‌లోని శ్రీ బాంకే బిహారీ మందిర్‌లో అమిత్ షా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం అమిత్ షా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ త‌రుణంలో మీడియాతో మాట్లాడుతూ..  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను ఎన్నుకోవడం అంటే ఉత్తరప్రదేశ్‌లో గూండా రాజ్యాన్ని తిరిగి ఆహ్వానించ‌డమేన‌ని కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

‘‘అఖిలేష్ బాబు.. నువ్వు చట్టం గురించి మాట్లాడుతున్నావు. మీ నేత అజాం ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై  చాలా ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసులు నమోదు అయ్యాయి. మీరు చట్టం గురించి మాట్లాడతారు.. మీరు సిగ్గుపడాలి ’’ అని పశ్చిమ ఉత్తర్‌లోని మధురలో జరిగిన బహిరంగ సభలో అన్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు యూపీని గ్యాంగ్‌స్టర్లు, నేరస్తులు పాలించేవారనీ, వారు
భయాందోళనకు గురయ్యేవారని, రాష్ట్ర పోలీసులు కూడా వారికి భయపడేవారని.. మహిళలు, యువతులు బయటకు రావాలంటేనే భయపడేవారని.. కానీ ఇప్పుడు అది మారిపోయింది. మరియు నేరస్థులు ఇప్పుడు పోలీసులంటే ఎంతగా భయపడుతున్నారు కాబట్టి వారు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. వాళ్ల మెడకి వాళ్లే ఉరి బిగించుకుంటున్నారు’’ అని అన్నారు.

 "మేము యూపీలో పాల‌న‌లోకి వ‌చ్చిన నాటి నుంచి నేరస్థులు, గ్యాంగ్‌స్టర్‌లపై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాం, వారిని కటకటాల వెనక్కి నెట్టాం. మేము యూపీలో 'పరివార్-వాద' (రాజవంశ పాలన),   'జాతి-వాద' (కులతత్వం) నుండి విముక్తి చేసాం.. అభివృద్ధిపై దృష్టి పెట్టాం.. అని అన్నాడు. 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ లేకుండా భారత అభివృద్ధి అసాధ్యమని, యూపీ ప్రజల నమ్మకం, అభిలాష ప్రకారం UP అభివృద్ధి సాధిస్తోందని, ఇక్క‌డ జ‌రిగే ఎన్నిక‌లే ఇది భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయిని అమిత్ షా అన్నారు. 

click me!