శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు రావాలని ఆదేశం..

Published : Jun 27, 2022, 01:07 PM ISTUpdated : Jun 27, 2022, 01:14 PM IST
 శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు రావాలని ఆదేశం..

సారాంశం

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నోటీసులు జారీచేసింది. రేపు విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నోటీసులు జారీచేసింది. పత్ర చావల్ ల్యాండ్ స్కామ్ కేసు విచారణకు సంబంధించి సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది.  ముంబైలోని ఈడీ కార్యాలయంలో సంజయ్ రౌత్‌ను విచారించే అవకాశం ఉంది. ఇక, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే  క్యాంపులో ఉద్దవ్ ఠాక్రే కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.  

ఈడీ, సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి కారణంగానే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు జరిగిందని ఉద్దవ్ ఠాక్రే మద్దతుగా ఉన్న నేతలు చెబుతున్నారు. ఈడీ చర్యపై ఉద్దవ్ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నోటీసులపై సంజయ్ రౌత్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. 

ఇక, మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి.  పొలిటికల్ ఇష్యూ చివరకు Supreme Courtకు చేరింది. Uddhav Thackeray వర్గం, Shiv Sena తిరుగుబాటు టీం ఏక్నాథ్ షిండేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి పిటిష‌న్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu