
Allu Arjun’s Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా ఫీవర్ ఇంకా తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా జనాలు నిరాజనాలు పట్టారు. దేశంలోని చాలా భాషల్లో పుష్ప డైలాగులు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పుష్ప.. పుష్ప రాజ్ తగ్గదేలే అంటూ బన్నీ చెప్పి ఈ డైలాగ్స్ ఎంత ఫేమస్ అయ్యాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ డైలాగ్స్ కు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ వీటిపై చేసిన వీడియోలు ఇప్పటికీ తెగ వైరల్ అవుతున్నాయి.
అనేపథ్యంలోనే అల్లు అర్జున్ చెప్పిన 'పుష్ప, పుష్ప రాజ్' అనే ఫేమస్ డైలాగ్స్ దేశాన్ని ఉర్రూతలుగిస్తోంది. ఇక హిందీ వెర్షన్ డైలాగ్స్ ఫీవర్ ఇప్పుడు బెంగాల్ పదో తరగతి విద్యార్థు తాకింది. హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్.. “పుష్ప.. పుష్ఫ రాజ్... మెయిన్ ఝుకేగా నహీ (నేను పుష్పా రాజ్‌ని... నేను తలవంచను) అంటూ చెప్పిన ఈ డైలాగ్.. యువతను తెగ ఆకట్టుకుంది. సినిమా వచ్చి చాలా రోజులు అయినప్పటికీ.. 10వ తరగతి విద్యార్థి ఇచ్చిన ఊహించని షాక్.. ఇప్పుడు వైరల్ గా మారింది. ‘పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే’.. అంటూ ఓ టెన్త్ విద్యార్థి రాసిన అన్సర్ షీట్ వైరల్ వైరల్ గా మారింది. ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లోని సెకండరీ స్కూల్ (పశ్చిమ బెంగాల్ మాధ్యమిక) పరీక్షల్లో 10వ తరగతి విద్యార్థి తన సమాధాన పత్రంపై అదే డైలాగ్‌ను రాసుకోవడం.. విద్యార్థులపై పుష్ప సినిమా ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇటీవలే బెంగాల్ లో 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. “పుష్ప, పుష్పా రాజ్” అని రాసి ఉన్న జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసే టీచర్ చూసి... కొద్దిగా షాక్ గురయ్యాడు. జవాబు పత్రం మధ్యలో పెద్ద పెద్ద అక్షరాలతో “పుష్ప, పుష్ప రాజ్... అపున్ లిఖేగా నహీ” (‘పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే’..) అని రాసి ఉండడం చూసి మూల్యాంకనాధికారి అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఆన్సర్ షీట్ ఫొటో వైరల్ గా మారింది.
కాగా, అల్లు అర్జున్ చెప్పిన పుష్ప సినిమాలోని మై జుకేగా నహీ అనే డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందంటే ప్రేక్షకులే కాదు కంపెనీలు కూడా ఈ డైలాగ్‌ని తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఈ సినిమా అల్లు అర్జున్ సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది. పుష్ప: ది రైజ్ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా సానుకూల స్పందన వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్టు తెరకెక్కుతోంది.