దారుణం.. ఫ్రిడ్జిలో భార్య, సూట్ కేసుల్లో పిల్లల శవాలు

By ramya neerukondaFirst Published 21, Aug 2018, 11:03 AM IST
Highlights

ఇంట్లోని హాలులో ఓ వ్యక్తి ఉరివేసుకొని కనిపించాడు. అతని భార్య శవం ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు గుర్తించారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ లో దారుణం  చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఒకే ఇంట్లో ఇదుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. 

మృతుల్లో భార్య, భర్త, వారి ముగ్గురు సంతానం ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని... తనిఖీలు చేపట్టారు. కాగా.. ఇంట్లోని హాలులో ఓ వ్యక్తి ఉరివేసుకొని కనిపించాడు. అతని భార్య శవం ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు గుర్తించారు. 

 

ఇద్దరు కుమార్తెల మృతదేహాలు ఓ సూట్‌కేసులో కనిపించగా, మరో కుమార్తె అల్మారాలోనూ విగతజీవిగా పడిఉంది. ఈ దృశ్యాలు చూసి పోలీసులతో పాటు అక్కడికి వెళ్లిన వారంతా తీవ్ర విస్మయానికి గురయ్యారు. ఇంటి యజమానే తన కుమార్తెలను, భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

ఒకేసారి కుటుంబసభ్యులందరూ చనిపోవడం వెనుక ఏదైనా తాంత్రిక శక్తుల హస్తం ఏదైనా ఉందేమోనన్న  కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Last Updated 9, Sep 2018, 11:55 AM IST