10 Rupees Coin: రూ.10 నాణెం చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ..

Published : Feb 09, 2022, 12:34 PM IST
10 Rupees Coin:  రూ.10 నాణెం చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ..

సారాంశం

10 Rupees Coin: రూ.10 నాణెం చెల్లుబాటుపై కేంద్ర క్లారిటీ ఇచ్చింది. రూ.10 నాణెం చెల్లదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఆర్‌బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని  వెల్లడించింది.  

10 Rupees Coin: మ‌న దేశంలో 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటులో ఉందా? అనే ప్ర‌తి భార‌తీయుడి సందేహం. కిరాణా దుకాణంలోకెళ్లి 10 రూపాయల కాయిన్ ఇస్తే చెల్లదని తిరిగి వెన‌క్కి ఇస్తుంటారు. అలాగే... మార్కెట్ కెళ్లి..  దూకాణందారుడి ప‌ది రూపాయల నాణెం ఇస్తే.. చెల్ల‌దంటూ.. వెన‌క్కి ఇచ్చేస్తుంటారు. ఇలా పెట్రోల్ బంక్ అయినా, ఛాయ్ దుకాణమైనా.. 10 రూపాయల కాయిన్ ఇవ్వ‌డానికి వెనకాడుతుంటారు. అస‌లు రూ.10 నాణెం చెల్లుతుందా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. కొంద‌రూ రూ.10 కాయిన్ చెల్లుతుందని, మ‌రికొందరు చెల్లద‌ని వాదనలు వినిపిస్తునే ఉన్నారు. గొడవలు జరిగిన సంద‌ర్భాలు లేక‌పోలేదు.

తాజాగా ఇదే  అంశంపై  కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ‘ 10 ప‌ది రూపాయల‌ కాయిన్స్ నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడంలేదా? వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటోందా?’ అని ఏఐఏడీఎంకే  ఎంపీ ఎ.విజయకుమార్‌ ప్రశ్నించారు. 

దీనిపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి స‌మాధానమిస్తూ..  దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఆర్‌బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని  వెల్లడించారు.
కేంద్రం అనుమతితో ఆర్‌బీఐ ప‌ది రూపాయల కాయిన్స్ వివిధ సైజులు,  డిజైన్లలో ముద్రిస్తోందనీ,  అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని తెలిపారు.  10 రూపాయల నాణేల‌న్నింటినీ లావాదేవీలకు  వినియోగించవచ్చ‌ని, అయితే రూ.10 నాణేలను తీసుకోవడంలేదని పౌరుల నుంచి కంప్లైంట్స్ అందుతున్నాయనీ, దీని గురించి ఆర్‌బీఐ చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలు, సందేహాలు తొలిగించ‌డానికి ఎప్పటికప్పుడురిజర్వ్ బ్యాంక్ పత్రికా ప్రకటనలు విడుదల చేస్తోందని,  దేశంలోని ప్రజలందరూ ఎలాంటి సంకోచం లేకుండా 10 రూపాయల నాణెం ఉపయోగించాలని చేయాలని తెలిపారు.  దేశవ్యాప్తంగా దీనిపై ఎస్‌ఎంఎస్‌ అవగాహన ఉద్యమం నిర్వహిస్తోందని కేంద్రమంత్రి పంకజ్‌ చౌదరి పేర్కొన్నారు. రూ.10 నాణెం చెల్లదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు.

10 రూపాయ‌ల నాణెం చెల్లుబాటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అనేక సార్లు క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి సందేహాలు లేకుండా చెల్ల‌మ‌ణీ చేయాల‌ని తెలిపింది. బ్యాంకులు కూడా సందేహాలను తీర్చాయి. అయినా రూ.10 నాణెం చెల్లదనే అనుమానాలు సామాన్యుల్లో, షాపుల నిర్వాహకుల్లో ఉన్నాయి. ఈ అయోమయానికి తెరదించుతూ రూ.10 నాణెం చెల్లుబాటు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా   క్లారిటీ ఇచ్చింది.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu