పార్టీ బలహీనంగా ఉంది.. నన్ను డీఎంకేలోకి తీసుకోండి: అళగిరి

By sivanagaprasad KodatiFirst Published 5, Sep 2018, 12:02 PM IST
Highlights

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి రెండో కుమారుడు అళగిరి చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టారు. స్టాలిన్‌ తనను పార్టీలోకి రానివ్వడం లేదని.. తన సత్తా ఏంటో తెలియజేసేందుకే అళగిరి ర్యాలీకి పిలుపునిచ్చాడు

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి రెండో కుమారుడు అళగిరి చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టారు. స్టాలిన్‌ తనను పార్టీలోకి రానివ్వడం లేదని.. తన సత్తా ఏంటో తెలియజేసేందుకే అళగిరి ర్యాలీకి పిలుపునిచ్చాడు. లక్షమంది తన మద్ధతుదారులతో అళగిరి మెరీనా బీచ్‌లోని తన తండ్రి సమాధిని సందర్శించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డీఎంకే బలహీనంగా ఉందని..పార్టీని బలోపేతం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. స్టాలిన్ నాయకత్వంలో పనిచేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. నన్ను పార్టీలోకి తిరిగి తీసుకుంటే చాలని ఆయన స్పష్టం చేశారు.

Last Updated 9, Sep 2018, 11:58 AM IST