
Akhilesh Yadav: జ్ఞాన్వాపి మసీదు వివాదం నేపధ్యంలో బీజేపీని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ టార్గెట్ చేశారు. ఆయన మంగళవారం అజంగఢ్ పర్యటనలో మాట్లాడుతూ.. బీజేపీ ద్వేషపూరిత క్యాలెండర్‌ను తయారు చేసిందని మండిపడ్డారు. జ్ఞాన్‌వాపి వంటి ఘటనలను బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తీసుకువస్తుందని ఆరోపించారు. జ్ఞాన్వాపి మసీదు లోపల చేసిన సర్వే పనులు సోమవారం పూర్తి కావడం. సర్వే వీడియోగ్రఫీలో సోమవారం శివలింగాన్ని కనుగొన్నట్లు హిందూ పక్షం పేర్కొవడం గమనార్హం.
దేశంలో ఆహారం, ఇంధన ధరలు భగ్గుమంటున్నాయని, దేశంలో ఎప్పుడూ లేని విధంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతోందని, వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల వరకూ వివాదాస్పద అంశాలను ముందుకు తెచ్చి విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుంటుందనీ ఆరోపించారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
ఇలాంటి అంశాలపై చర్చలో మునిగితేలుతుంటే.. దేశానికి చెందిన ఏ ఆస్తులను అమ్ముతున్నారో మనకు తెలియదని విమర్శించారు. బీజేపీ ఒన్ నేషన్ ఒన్ రేషన్ నినాదం ముందుకు తెస్తున్నా ఆ పార్టీ నేతలు ఒన్ నేషన్..ఒన్ బిజినెస్‌మెన్ కోసం పనిచేస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
దీని తరువాత, వారణాసిలోని స్థానిక కోర్టు సూచనల మేరకు జ్ఞాన్వాపికి చెందిన వాజు ఖానాకు సీలు వేశారు. అయితే, మొఘల్ కాలంలో నిర్మించిన అన్ని మసీదుల్లో వుజు ఖానా లోపల ఫౌంటెన్ ఉండేదని ముస్లిం పక్షం ఈ వాదనను ఖండిస్తోంది. ఆ తర్వాత ఈ విషయంపై రాజకీయ దుమారం రేగింది.
ఈ క్రమంలో సీఎం యోగి ఆసుపత్రిని ప్రారంభించడాన్ని కూడా అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఆసుపత్రిని సీఎం ప్రారంభించారని తెలిపారు. నివాస ప్రాంతంలో ఆసుపత్రిని ఎలా నిర్మించారు? లక్నోలో క్యాన్సర్ రోగులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడానికి గ్లోబల్ హెల్త్‌కేర్ హాస్పిటల్‌లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను సిఎం యోగి ఆదివారం ప్రారంభించారు.
అఖిలేష్ యాదవ్ రాజీనామా తర్వాత అజంగఢ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. దీనిపై రాజకీయ దుమారం రేగింది. కాగా, ఎస్పీ చీఫ్ ఇవాళ అజంగఢ్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు.