తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరో అజిత్

By pratap reddyFirst Published Jan 22, 2019, 6:44 AM IST
Highlights

తమిళనాడు స్టార్ హీరో అజిత్ రాజకీయాల్లోకి వస్తారని మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో అజిత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా భావిస్తూ వస్తున్నారు.

హైదరాబాద్: తమిళనాడు స్టార్ హీరో అజిత్ రాజకీయాల్లోకి వస్తారని మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో అజిత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా భావిస్తూ వస్తున్నారు. దివంగత నేత జయలలితకు అత్యంత ఇష్టమైనవాడు అజిత్. అందుకే ఆయనను జయలలిత వారసుడిగా భావిస్తూ వచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పష్టత ఇచ్చారు.

రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి తనకు లేదని అజిత్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాజకీయాల్లో తాను ఉండబోనని చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద కేవలం సాధారణ ఓటరుగా నిలబడటమే తనకిష్టమని అన్నాడు. 

గత కొంత కాలంగా తాను అన్నాడీఎంకేలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నాడు. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మొద్దని కోరారు. సినిమా అనేది తన వృత్తి అని, తాను సినిమాలకే పరిమితమవుతానని అన్నాడు. రాజకీయాల పరంగా తన అభిప్రాయం తనకు ఉంటుందని చెప్పారు.

అభిమానుల అభిప్రాయం అభిమానులకు ఉంటుందని అన్నాడు. "మీ అభిప్రాయాన్ని నాపై రుద్దకండి. నేనెప్పుడూ మిమ్మల్ని ఫలానా పార్టీకి మద్దతివ్వండని కానీ.. ఓటేయండని కానీ మీకు చెప్పను.. అది మీ చాయిస్ అంతే" ఆయన అభిమానులను ఉద్దేశించి అన్నారు. 


తనకు సంబంధించి ఫ్యాన్స్ క్లబ్స్ ఎత్తేయడం జరిగిందని, ఎవరైనా అభిమానుల సంఘం పేరుతో హడావుడి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.

click me!