సూపర్ ఆఫర్...కేవలం రూ.500లకే విమాన ప్రయాణం

Published : Sep 17, 2018, 07:18 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
సూపర్ ఆఫర్...కేవలం రూ.500లకే విమాన ప్రయాణం

సారాంశం

ప్రముఖ విమానయాన సంస్థ ఏయిర్ ఏషియా ప్రయాణికుల కోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.500లకే ప్రయాణికులకు విమాన ప్రయాణాన్ని అందించనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా తమ విమానాలు ప్రయాణించే 21 మార్గాల్లో లిమిటెడ్ గా ఈ టికెట్లను అందింస్తున్నట్లు ఏయిర్ ఏషియా ఇండియా ప్రకటించింది.  

ప్రముఖ విమానయాన సంస్థ ఏయిర్ ఏషియా ప్రయాణికుల కోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.500లకే ప్రయాణికులకు విమాన ప్రయాణాన్ని అందించనున్నట్లు ఈ సంస్థ కటించింది. దేశ వ్యాప్తంగా తమ విమానాలు ప్రయాణించే 21 మార్గాల్లో లిమిటెడ్ గా ఈ టికెట్లను అందిస్తున్నట్లు ఏయిర్ ఏషియా ఇండియా ప్రకటించింది.

ఈ సూపర్ సేల్ ఆఫర్ లో భాగంగా టికెట్లు పొందాలనుకునేవారు ఇవాళ్టి( సెప్టెంబర్ 17) నుండి సెప్టెంబర్ 31తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ ద్వారా సెప్టెంబర్ 17 నుండి 2019 మార్చి 31 వరకు ప్రయాణించవచ్చు. అయితే ఎయిర్‌ ఏషియా. కాం, ఎయిర్‌ఏషియా మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఈ సూపర్‌ సేల్‌ విమాన టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుందని విమానయాన సంస్థ ప్రకటించింది. 

కేవలం దేశీయ ప్రయాణం కోసమే ఈ ఆఫర్ ప్రకటించినట్లు ఏయిర్ ఏషియా తెలిపింది.ఈ వన్ వే టికెట్ రూ.500 నుండి పదిహేను వందల మధ్యలో డిస్కౌంట్ ధరల్లో లభ్యమవుతోంది.   

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు