త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ 

By Rajesh KarampooriFirst Published Sep 26, 2022, 11:34 PM IST
Highlights

ఎయిర్ ఇండియాకు చెందిన‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది.  సోమ‌వారం కేరళ లోని కోజికోడ్ నుండి ఢిల్లీకి వెళ్తున్న‌ ఎయిర్ ఇండియా విమానానికి ప‌క్షి ఢీ కొట్ట‌డంతో కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 
 

ఇటీవ‌ల‌ కాలంలో భార‌త విమానయాన సంస్థ‌ల‌కు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు  తీవ్ర‌మయ్యాయి. దీని కారణంగా ప‌లు విమానాలను దారి మళ్లించడం. లేదంటే.. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడం వంటి ప‌లు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త మూడు నెలలుగా భారతీయ విమానాలతో పాటు. అంత‌ర్జాతీయ విమానాలు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. దీంతో విమాన ప్రయాణీకులకు గుబులు ప‌ట్టుకుంది. 

తాజాగా.. ఎయిర్ ఇండియాకు చెందిన‌ విమానానికి పెను ప్రమాదం నుంచి బయటపడింది. సోమ‌వారం కేరళ లోని కోజికోడ్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టేకాఫ్ అయిన వెంటనే .. ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొనడంతో కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో  మ‌రోసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై DGCA ఓ ప్రకటన కూడా వెలువడింది. 135 మంది ప్రయాణికులతో కోజికోడ్ నుండి బయలుదేరి ఢిల్లీకి వెళ్తున్న విమానం అత్య‌వ‌స‌రంగా కన్నూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యింద‌ని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. 

 135 మంది ప్రయాణికుల్లో 85 మంది కోజికోడ్‌కు చెందిన వారు, 50 మంది కన్నూర్‌కు చెందిన వారని, వారందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు ఎస్‌హెచ్‌వో తెలిపారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులను ఇతర విమానాల్లో బస చేసేందుకు ఎయిర్‌లైన్స్ ఏర్పాట్లు చేశామని, ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులను కన్నూర్‌లోని రెండు హోటళ్లలో ఉంచామని, వారి ప్రయాణ ఏర్పాట్లు మంగళవారం జరుగుతాయని ఆయన చెప్పారు.

click me!