టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో ఊడిన ఫ్లైట్ టైర్: సురక్షితంగా విమానం ల్యాండింగ్

Published : May 07, 2021, 05:18 PM IST
టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో ఊడిన ఫ్లైట్ టైర్: సురక్షితంగా  విమానం ల్యాండింగ్

సారాంశం

 విమానం టైర్ ఊడినా కూడ అందులోని ప్రయాణీకులను సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దించారు పైలెట్.  ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.  గురుగ్రామ్‌లోని జెట్ సర్వ ఏవియేషన్  ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఎయిర్ అంబులెన్స్ గురువారం నాడు సాయంత్రం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి ముంబైకి బయలుదేరింది. 

న్యూఢిల్లీ: విమానం టైర్ ఊడినా కూడ అందులోని ప్రయాణీకులను సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దించారు పైలెట్.  ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.  గురుగ్రామ్‌లోని జెట్ సర్వ ఏవియేషన్  ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఎయిర్ అంబులెన్స్ గురువారం నాడు సాయంత్రం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి ముంబైకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  విమానం టైర్  ఊడిపోయింది. ఈ విషయాన్ని విమాన సిబ్బంది గుర్తించారు. ఈ విమానంలో  రోగి, అతడి బంధువు, ఒక వైద్యుడు , ఇద్దరు సిబ్బంది ఉన్నారు.  

విమానం టైరు ఊడిన విషయాన్ని విమాన సిబ్బంది ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం చేరవేశారు. విమానాన్ని రన్‌వేపై క్షేమంగా ఎలా దించాలనే విషయమై చర్చించారు. నేరుగా రన్‌వేపై విమానాన్ని దించితే  మంటలు వ్యాపించే అవకాశం ఉందని భావించారు.రన్ వే పై విమానం ల్యాండ్ అయ్యే సమయంలో  మంటలు వ్యాపించకుండా ఒక ఉపాయం ఆలోచించారు.రన్‌వేపై నురగతో కూడిన నీళ్లు చల్లారు. రన్ వేపై విమానం ల్యాండైన సమయంలో మంటలు వ్యాపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకొన్నారు. విమానం సురక్షితంగా ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం