నేవీలో 200 నౌకలు అవసరం కాగా.. మన దగ్గర 130 మాత్రమే ఉన్నాయి... ప్రధానిని టార్గెట్ చేసిన ఒవైసీ

Published : Sep 02, 2022, 05:26 PM IST
నేవీలో 200 నౌకలు అవసరం కాగా.. మన దగ్గర 130 మాత్రమే ఉన్నాయి... ప్రధానిని టార్గెట్ చేసిన ఒవైసీ

సారాంశం

నేవీలో 200 నౌకలు అవసరం కాగా, మన దగ్గర 130 మాత్రమే ఉన్నాయని ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్న ఒవైసీ విమ‌ర్శ‌లు చేశారు. నేడు ప్రధాని ప్రారంభించిన INS విక్రాంత్ స్వదేశీ విమాన వాహక నౌకను 2013లో ప్రారంభించినట్లు ఒవైసీ తెలిపారు.   

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ భారత నౌకాదళంలో చేరింది. ఈ యుద్ద‌నౌకను శుక్రవారం కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రధాని మోదీ నౌకదళానికి అంద‌జేశారు. ఇప్పటి వరకు.. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో దేశంలో నిర్మించిన అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ కావడం మ‌రో విశేషం.
 
ఈ నేప‌థ్యంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ భారత నౌకాదళానికి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ స్వదేశీ విమాన వాహక నౌకను 2013లోనే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మరి మూడో విమాన వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని కూడా ఆలోచించాలి. నేవీలో 200 నౌకలు అవసరమని, కేవ‌లం 130 మాత్రమే ఉన్నాయని ఒవైసీ విమ‌ర్శించారు. ప్రధాని మోదీ తన విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినందుకే  ఆ యుద్ద విమానాల‌ను అనుమతించడం లేదని అన్నారు.

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సిఎస్‌ఎల్)లో స్వదేశీంగా నిర్మించిన నౌకను నేవీ ఫ్లీట్‌లో ప్రధాని మోదీ చేర్చారు. 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మాజీ నేవీ షిప్ విక్రాంత్ పేరు మీదుగా ఈ నౌకకు పేరు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత రక్షణ రంగాన్ని స్వావలంబనగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న నిబద్ధతకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఉదాహరణ అని అన్నారు.

విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు...- ప్రధాని మోదీ

స్వదేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన‌ విమాన వాహక నౌకలను నిర్మించగల దేశాల స‌ర‌స‌న భార‌త్ చేరింద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. విక్రాంత్ ప్రత్యేకం, విక్రాంత్ యుద్ధ నౌక మాత్రమే కాదు. 21వ శతాబ్దపు భారతదేశ కృషి, ప్రతిభ, నిబద్ధతకు ఇది నిదర్శనమ‌ని అన్నారు. అదే సమయంలో.. గత ఎనిమిదేళ్లలో దేశ ఓడరేవు సామర్థ్యం రెండింతలు పెరిగిందని ప్రధాని అన్నారు. 

 

దీనితో పాటు.. ఆధునిక భారతదేశ నిర్మాణానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి ముఖ్యమని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం తయారీ రంగం, 'మేక్ ఇన్ ఇండియా' విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రజల అవసరాలు, ఆకాంక్షలను త్వరితగతిన తీర్చేందుకు కృషి చేస్తోందని అన్నారు. 

ఐఎన్ఎస్ విక్రాంత్ అనేక ప్రభుత్వాల కృషి ఫలం: జైరాం రమేష్ 

ఐఎన్ఎస్ విక్రాంత్ అనేక ప్రభుత్వాల కృషి ఫలమని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. 'ఐఎన్‌ఎస్ విక్రాంత్ 1999 నుండి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాల సంయుక్త కృషి. 1971 యుద్ధంలో ఐఎన్ ఎస్  అద్భుతమైన పాత్ర పోషించింద‌ని గుర్తుంచుకోవాలి. ఐఎన్ఎస్ ను UK నుండి భారతదేశానికి తీసుకురావడంలో కృష్ణ మీనన్  కీలక పాత్ర పోషించారు. అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu