
Asaduddin Owaisi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని స్వనిధి పథకంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకపడ్డారు. కేంద్ర ప్రభుత్వం “సబ్కా సాత్” మంత్రాన్ని ఎక్కడ అమలు చేసిందని విరుచుకుపడ్డారు. స్వనిధి పథక అమలులో మైనారిటీ వర్గానికి చెందిన వీధి వ్యాపారులకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఈ పథకం ద్వారా 32 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేశామని, అందులో కేవలం 0.0102 శాతం మైనారిటీ వర్గానికి చెందిన వ్యాపారులకు రుణాలు అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని స్వనిధి పథకంపై ఒవైసీ తన ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ గణాంకాలు మోదీ సబ్‌కా సాథ్ అపోహను బట్టబయలు చేశాయని విమర్శించారు. ప్రభుత్వ డేటా మోడీ సబ్‌కా సాథ్ పురాణాన్ని నాశనం చేస్తుంది. ఈ పథకం ద్వారా 32 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వగా.. అందులో కేవలం 331 మంది మైనార్టీలకు మాత్రమే రుణాలు అందాయనీ.. అది కేవలం 0.0102 శాతమని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో చాలా మంది ముస్లిం మైనారిటీలు ఆధారపడ్డారని అన్నారు.
ప్రధాని మోదీ సావర్కర్-గోల్వాల్కర్ సిద్దాంతాలను అమలు చేస్తున్నారని, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. RTI డేటాను ఉటంకిస్తూ.. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ బ్లాగ్‌కి సంబంధించిన లింక్‌ను కూడా షేర్ చేశారు.
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం.. PM సవనిధి యోజన కింద జూన్ 2020 నుంచి మే 2022 మధ్య కేవలం 0.01 శాతం మంది మైనారిటీ కమ్యూనిటీ చెందిన వీధి వ్యాపారులు మాత్రమే సహాయం పొందారని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఈ పథకం కింద 3.15 శాతం మంది ఎస్టీ వర్గానికి చెందిన వారు రుణాలు పొందారని తెలిపారు. రాష్ట్రాల పరంగా గమనిస్తే.. మహారాష్ట్రలో గరిష్టంగా 162, ఢిల్లీలో 110, తెలంగాణలో 22, గుజరాత్‌లో 12, ఒడిశాలో8 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని మైనారిటీ కమ్యూనిటీలో ఈ పథకం సక్సెస్ రేటు 56.45 శాతంగా ఉందనీ, పీడబ్ల్యూడీ గ్రూపు నుంచి 8,631 దరఖాస్తులు వచ్చాయనీ.. మరోవైపు, పీడబ్ల్యూడీ కేటగిరీ నుంచి వచ్చిన గరిష్ట సంఖ్య 7,278 మంది ఈ పథకం ప్రయోజనం పొందారని తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని జూన్ 2020లో కేంద్రం ప్రారంభించింది.