తమ జీవితంలో పండంటి ఆడ పిల్ల వచ్చినందుకు దేవేందర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.కాగా.. ఈ సందర్భంగా దేవేందర్ కి ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా దేవేందర్, ఆయన భార్య వైరస్ నుంచి పూర్తి గా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ ఈ ప్రభావం మరింత ఎక్కువగానే ఉంది. కరోనా ని నిర్మూలించేందుకు తమ ప్రాణాలను సైతం పణంగాపెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. కాగా.. ఇటీవల ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ కి కరోనా సోకగా.. అతని ద్వారా అతని భార్యకి కూడా సోకింది. కాగా.. ఆ సమయంలో ఆమె గర్భిణీ కాగా.. తాజాగా పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జహంగిరీపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ దేవేందర్ కి గత నెలలో కరోనా వైరస్ సోకింది. ఆయన నుంచి భార్యకి కూడా సోకగా... ఆమె నిండు గర్భిణీ కావడం గమనార్హం. దీంతో.. ఇద్దరూ వైరస్ పై తీవ్రంగా పోరాడారు. కాగా.. వారి జీవితంలో ఇప్పుడు ఆనందం వెల్లువెరిసింది.
తమ జీవితంలో పండంటి ఆడ పిల్ల వచ్చినందుకు దేవేందర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.కాగా.. ఈ సందర్భంగా దేవేందర్ కి ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా దేవేందర్, ఆయన భార్య వైరస్ నుంచి పూర్తి గా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దేవేందర్ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ సమయంలో తాను విధులు నిర్వహిస్తుండగా వైరస్ సోకిందని చెప్పాడు. తనతో పాటు తనతో పనిచేసే మరో ఆరుగురికి కూడా వైరస్ సోకిందని వివరించాడు. అయితే.. తాను తన భార్య గురించే ఎక్కువగా ఆందోళన చెందినట్లు చెప్పాడు. తనకు కరోనా పాజిటివ్ అని తేలగానే... తన భార్యకు వేరే ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారని.. ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్నాడు. దీంతో తాను చాలా ఆందోళన చెందినట్లు చెప్పాడు. ఎందుకంటే తన భార్య అప్పటికే గర్భవతిగా ఉందని చెప్పాడు. ఇప్పుడు తమ జీవితంలో మరో జీవి రావడం ఆనందంగా ఉందని చెప్పాడు.