కోర్టు ఆవరణలోనే అడ్వకేట్ దారుణ హత్య: నిందితుడి అరెస్ట్

Published : Feb 28, 2021, 11:34 AM IST
కోర్టు ఆవరణలోనే అడ్వకేట్ దారుణ హత్య: నిందితుడి అరెస్ట్

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని హూస్పేట సివిల్ జేఎంఎఫ్‌సీ కోర్టు ఆవరణలో శనివారం నాడు కాంగ్రెస్ నేత, న్యాయవాది తారిహళ్లి వెంకటేష్  దారుణ హత్యకు గురయ్యాడు. 


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని హూస్పేట సివిల్ జేఎంఎఫ్‌సీ కోర్టు ఆవరణలో శనివారం నాడు కాంగ్రెస్ నేత, న్యాయవాది తారిహళ్లి వెంకటేష్  దారుణ హత్యకు గురయ్యాడు. మ్యాసకేరికి చెందిన వెంకటేష్‌కు తమ్ముడి కొడుకయ్యే  మనోజ్ కి మధ్య కొద్దినెలలుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. 

వెంకటేష్ ప్రతి రోజూ మాదిరిగానే కోర్టుకు వచ్చి కుర్చీలో కూర్చొని నోటరీలు చూసుకొంటున్నాడు. ఇదే అదనుగా భావించిన మనోజ్ కొడవలితో  వెంకటేష్‌ ను నరికాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.కుర్చీలో కొద్దిసేపు కొనప్రాణాలతో ఆయన కొట్టుమిట్టాడి ప్రాణాలు కోల్పోయాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

కోర్టు ఆవరణలో విధుల్లో ఉన్న పోలీసులు నిందితుడు మనోజ్ ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమా ఇంకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం