హార్దిక్ పటేల్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..

Published : Jan 21, 2019, 01:06 PM IST
హార్దిక్ పటేల్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..

సారాంశం

పటేదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆయనకు తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ తో వివాహం నిశ్చయమైంది. 


పటేదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆయనకు తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ తో వివాహం నిశ్చయమైంది. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులు అధికారికంగా ప్రకటించారు.

సురేంద్ర నగర్ జిల్లా దిగ్సార్ గ్రామంలోని హార్దిక్ కులదైవమైన బహుచార్-మల్ది మాతా ఆలయంలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం జరగనుందని సన్నిహితులు తెలిపారు. వివాహం అనంతరం నూతన దంపతులు హార్దిక్ స్వగ్రామం వీరంగంనకు వెళ్లనున్నారు.

వీరి వివాహం గురించి హార్దిక్ తండ్రి భరత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. హార్దిక్, కింజల్ బాల్య స్నేహితులు అని వివరించారు. వారి వివాహానికి ఇరు కుటుంబాల వారు అంగీకరించామని.. ఈ నెల 27న వివాహం అని చెప్పారు.  పటేదార్ ఉద్యమం సమయంలో హార్దిక్ జైలుకి వెళ్లిన సమయానికే వీరిద్దరికీ వివాహం నిశ్చయమైందనే ప్రచారం జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం