4 ఏళ్ల బాలిక గీతానికి మోడీ ఫిదా: మిజోరం చిన్నారికి నెటిజన్ల ప్రశంసలు

By narsimha lodeFirst Published Nov 1, 2020, 10:19 AM IST
Highlights

మిజోరం రాష్ట్రానికి చెందిన బాలిక పాడిన వందేమాతరం గీతం పలువురి ప్రశంసలు పొందింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడ  ఫిదా అయ్యాడు. బాలికపై ఆయన  అభినందించారు.


న్యూఢిల్లీ: మిజోరం రాష్ట్రానికి చెందిన బాలిక పాడిన వందేమాతరం గీతం పలువురి ప్రశంసలు పొందింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడ  ఫిదా అయ్యాడు. బాలికపై ఆయన  అభినందించారు.

బాలిక ప్రదర్శనను ప్రశంసించారు.బాలిక  ప్రదర్శన ప్రశంసనీయమైందని మోడీ అభిప్రాయపడ్డారు.మిజోరాం రాష్ట్రంలోని ఎస్తేర్ హన్మ్టే మా తుజే సలాలం , వందేమాతరం గీతాన్ని పాడింది.ఈ గీతాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది.ఈ వీడియో సీఎం జోరామ్ తంగాను ఆకర్షించింది. 

 

Adorable and admirable! Proud of Esther Hnamte for this rendition. https://t.co/wQjiK3NOY0

— Narendra Modi (@narendramodi)

ఈ వీడియోను చూసిన సీఎం ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను ట్వీట్ చేశాడు. రాష్ట్రంలోని లుంగ్లీకి చెందిన 4 ఏళ్ల బాలిక ఈ పాట పాడిందని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఈ బాలిక వీడియోను ప్రధాని మోడీ కూడ ట్వీట్ చేశారు. బాలికను ప్రధాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్  రహమాన్  మా తుజే సలాం, వందేమాతరం గీతం మిలియన్ల మంది హృదయాలను గెలుచుకొంది. ఇప్పుడు అదే గీతాన్ని ఈ బాలిక  పాడి పలువురి ప్రశంసలను పొందింది.

click me!