‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ ప్రకటన..! ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు.. పోస్ట్ వైరల్..

By SumaBala BukkaFirst Published Sep 24, 2022, 6:44 AM IST
Highlights

డెత్ సర్ఠిఫికెట్ పోయిందంటూ ఓ వ్యక్తి ఇచ్చిన పేపర్ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది. దొరికితే ఎక్కడివ్వాలి స్వర్గంలోనా.. నరకంలోనా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

అస్సాం : సోషల్ మీడియా.. అనేదే ఓ వైరల్.. ఇక అందులో కాస్త విచిత్రంగా ఉన్న పోస్టులు కనిపిస్తే మరింత వైరల్ చేసేదాకా వదిలిపెట్టరు నెటిజన్లు.. రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు పోస్ట్ అవుతూ ఉంటాయి. వాటిల్లో ఆశ్చర్యానికి గురి చేసేవి కొన్ని ఉంటే.. ఆలోచింపచేసేవి మరికొన్ని ఉన్నాయి. ఇంకొన్ని హాస్యాన్ని పుట్టిస్తాయి. అలా ఓ వ్యక్తి ఇచ్చిన ప్రకటన ఎంతోమందిని నవ్వుకునేలా చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా’ అంటూ క్యాప్షన్ జతచేశారు. 

ఇంతకీ ఏమిటా పోస్టు అంటే.. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నట్టు ఓ పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన అస్సాంలోని లందింగ్ బజార్ వద్ద ఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రకటనలో రిజిస్ట్రేషన్ నెంబర్, వరుస సంఖ్య కూడా ఉన్నాయి. ఈ పోస్ట్ ను చూసిన వినియోగదారుల్లో ఒకరు ఆ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ స్వర్గం నుంచి ఇవ్వాలని అడుగుతున్నారు అని కామెంట్ చేశారు.  మరో యూజర్ ఎవరో ఓ వ్యక్తి  తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నాడు.  దొరికిన వాళ్లు అతనికి ఇచ్చేయండి అంటూ కామెంట్ చేశారు. ఇలా పలువురు యూజర్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

 

It happens only in 😂😂😂 pic.twitter.com/eJnAtV64aX

— Rupin Sharma (@rupin1992)
click me!